Vishwambhara
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చాలా కాలం తర్వాత చేస్తున్న గ్రాఫికల్ వండర్ ‘విశ్వంభర'(Viswambhara Movie). అప్పుడెప్పుడో మన చిన్నతనం లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంజి’ చిత్రం మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టింది. గ్రాఫిక్స్ ఓవర్ డొసేజ్ అవ్వడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని అప్పట్లో అందరూ అనుకునేవారు. స్క్రీన్ ప్లే కూడా బోరింగ్ గా ఉండడంతో ఫలితం బెడిసికొట్టింది. అప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి ప్రాజెక్ట్స్ జోలికి వెళ్ళలేదు. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ కెరీర్ ని సాగించాడు. రీ ఎంట్రీ తర్వాత కూడా ఆయన కమర్షియల్ సినిమాలతో నెట్టుకొస్తున్న చిరంజీవి, అంజి చిత్రం తాలూకా జ్ఞాపకాలు అలా పదిలంగా ఉన్నప్పటికీ కూడా ‘విశ్వంభర’ చిత్రాన్ని ఒప్పుకున్నాడంటే ఈ సినిమా స్టోరీ ఆయన్ని ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమా ప్రకటించిన కొత్తల్లో అభిమానుల్లోనే కాకుండా, ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ విపరీతంగా ఉండేది. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ సినిమా పై ఇంత బజ్ ఏ సినిమాకి కూడా క్రియేట్ అవ్వలేదని అందరూ మాట్లాడుకునేవారు. కానీ ఎప్పుడైతే గత ఏడాది టీజర్ విడుదలైందో, అప్పటి వరకు ఈ సినిమా మీద ఉన్న హైప్ మొత్తం నీరుగారిపోయింది. ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ కి ఏ రేంజ్ ట్రోల్స్ అయితే వచ్చాయో, ‘విశ్వంభర’ టీజర్ కి గ్రాఫిక్స్ విషయం లో అంతకు మించిన ట్రోల్స్ వచ్చాయి. దీంతో మూవీ టీం బాగా అలెర్ట్ అయ్యింది. వెంటనే గ్రాఫిక్స్ విషయం లో ప్రత్యేకమైన కేర్ తీసుకొని, కొత్త టీం ని పెట్టుకుంది. కానీ అ టీం వర్క్ కూడా చిరంజీవి కి ఏమాత్రం నచ్చలేదట. దీంతో మళ్ళీ VFX టీంలో కొత్తవాళ్లను తీసుకొని, గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేయిస్తున్నారట.
ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం. దీంతో మే లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమాని జనవరి 10 న విడుదల చేయాలని అనుకున్నారు. ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్ర కోసం వాయిదా వేసుకున్నారు. అ తర్వాత మే లో విడుదల చేయాలని అనుకున్నారు కానీ, గ్రాఫిక్స్ మెగాస్టార్ అంచనాలకు చేరువ కాకపోవడంతో మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తి అయ్యినట్టే, ప్యాచ్ వర్క్ ఒక్కటే బ్యాలన్స్ ఉంది. కొత్తగా వచ్చిన టీం గ్రాఫిక్స్ ని సకాలంలో పూర్తి చేస్తే ఈ చిత్రం కచ్చితంగా ఈ ఏడాదిలోనే వస్తుంది. లేకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. లేదా వేరే ఏదైనా డేట్ ని చూసుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా విషయం లో ఇంకెన్ని ట్విస్టులు ఎదురు అవుతాయి అనేది.