Homeఎంటర్టైన్మెంట్Vishwambhara latest release date: 'విశ్వంభర' లేటెస్ట్ విడుదల తేదీ ఇదే.. ఈసారి కూడా మిస్...

Vishwambhara latest release date: ‘విశ్వంభర’ లేటెస్ట్ విడుదల తేదీ ఇదే.. ఈసారి కూడా మిస్ అయితే ఇక ఓటీటీ నే దిక్కు..

Vishwambhara latest release date: ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘విశ్వంభర'(Vishwambhara Movie) నిలిచింది. ఎప్పుడో 2023 సంవత్సరం లో మొదలైన ఈ చిత్రం, షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నప్పటికీ కూడా విడుదలకు నోచుకోలేదు. కారణం గ్రాఫిక్స్. ఆరంభం లో ఈ సినిమా గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేదని, డైరెక్టర్ వశిష్ఠ VFX టీం మొత్తాన్ని మార్చేసి మళ్లీ గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేయడం మొదలు పెట్టారు. కానీ ఇప్పటి వరకు ఆ వర్క్ పూర్తి అవ్వలేదు. ఆ కారణం చేతనే ఈ సినిమా విడుదల తేదీని లాక్ చెయ్యలేదు. అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం చూస్తే ఈ సినిమా ఫైనల్ VFX వర్క్ వచ్చే నెలాఖరు లోపు డెలివరీ అవుతుందని, ఆ తర్వాత సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించి ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారని టాక్.

ఈ మూవీ ని ఆగస్టు 21 న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఆగస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అనే విషయం మన అందరికీ తెలిసిందే. బజ్ లేని ఈ సినిమాని మెగాస్టార్ పుట్టినరోజు నాడు విడుదల చేస్తే అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం వస్తుందని, మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని, అందుకే ఈ చిత్రాన్ని ఆగస్టు 21 న విడుదల చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట మేకర్స్. త్వరలోనే అధికాటికా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈసారి విడుదల తేదీని ప్రకటించిన తర్వాత మరోసారి వాయిదా వేస్తే మాత్రం ఈ చిత్రాన్ని నేరుగా ఇక ఓటీటీ లో చూసుకోవాల్సిందే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి, ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ ని కూడా పూర్తి చేసి, ఇప్పుడు మరో కొత్త సినిమాని కూడా మొదలు పెట్టబోతున్నాడు.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. ఎందులో చూడాలంటే..

ఇంత ఆలస్యం అయిన ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తి లేరు. ఇలాంటి సమయం లో మరోసారి వాయిదా పడితే మాత్రం విడుదల చేసి కూడా ఉపయోగం ఉండదని అంటున్నారు ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అతి నీచమైన ఫ్లాప్ గా నిల్చిన సినిమా ఏది అంటే , మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ‘భోళా శంకర్’. ఇప్పుడు ‘విశ్వంభర’ చిత్రానికి కూడా ఆ పరిస్థితి ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయని, కానీ మంచి థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసి, ప్రొమోషన్స్ బలంగా చేపడితే మాత్రం కాస్త మంచి బజ్ ఏర్పడొచ్చని అంటున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి, రీజనల్ ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ‘విశ్వంభర’ కి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular