Vishwambhara: గత రెండు రోజులుగా విశ్వంభర(Viswambhara Movie) మూవీ లోని గ్రాఫిక్స్ గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం దాదాపుగా 75 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసారని దీని సారాంశం. గత ఏడాది విడుదలైన ఈ సినిమా టీజర్ లోని గ్రాఫిక్స్ కి సోషల్ మీడియా నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పాలా..?, అభిమానులు సైతం ఏంటి ఈ నాసిరకపు గ్రాఫిక్స్?, మా మెగాస్టార్(Megastar Chiranjeevi) తో ఏ సినిమా తీస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇక దురాభిమానుల సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలంలో ఈ సినిమా మీద టీజర్ మీద వచ్చినన్ని ట్రోల్స్ , దేని మీద రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే మూవీ టీం అలెర్ట్ అయ్యి, VFX టీం మోతంన్ని మార్చి, మరి సరికొత్త VFX షాట్స్ ని చేయించింది.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాని రిజెక్ట్ చేసిన అనుపమ పరమేశ్వరన్..కారణం ఏమిటంటే!
అందుకోసం అయిన ఖర్చు 75 కోట్ల రూపాయిలు అట. కానీ కొంతమంది మాత్రం అంత ఖర్చు అసలు అవ్వలేదు, కేవలం సినిమా మీద హైప్ పెంచడం కోసం ఇలా చెప్తున్నారు అంటూ కథనాలు ప్రచారం చేస్తున్నారు . ఈ సినిమాకి కేవలం 25 కోట్లు మాత్రమే గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేసారని భోగట్టా. ఈ రెండు సమాచారాల్లో ఏది నిజం?, ఏది అబద్దం అనేది అభిమానులు తేల్చుకోలేకపోతున్నారు. టీజర్ లో చూపించిన గ్రాఫిక్స్ ని చూసి 75 కోట్లు ఖర్చు అయ్యింది అంటే చిన్న పిల్లవాడు కూడా నమ్మడు. పోనీ కొత్త VFX షాట్స్ కి సంబంధించిన ఫుటేజీ ఇంకా బయటకు రాలేదు కదా, అది చూడకుండా 75 కోట్లు ఖర్చు కాలేదని ఎలా చెప్పగలం ? అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎంత ఖర్చు చేసిన, సరైన లైటింగ్స్ షాట్ మేకింగ్ లేకుంటే లాభం లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట రీసెంట్ గానే విడుదలైంది. ‘రామ రామ’ అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి లుక్స్ బాగున్నాయి కానీ, వీడియో క్వాలిటీ మాత్రం చాలా నాసిరకంగా ఉంది అనేది అభిమానుల అభిప్రాయం. ఇలాంటి సమయం లో 75 కోట్లు గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేసారంటే కచ్చితంగా ఎవ్వరూ నమ్మలేరు. చూడాలి మరి భవిష్యత్తులో విడుదల చేసే కంటెంట్ లో ఏమైనా క్వాలిటీ ఉంటుందో లేదో అనేది. అంచనాలు అయితే ఈ సినిమా ప్రకటించినప్పుడు చాలా భారీగా ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం అసలు అంచనాలే లేవు. ఓటీటీ రైట్స్ కూడా ఇంకా అమ్ముడుపోలేదు. ఫలితంగా ఈ సినిమా విడుదల ఎప్పుడు అవుతుంది అనే దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. జులై లేదా ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.