Tollywood Hero : తన క్లాస్ మేట్స్ అందరు యూనిఫార్మ్ లో ఉంటే ఒక్క కుర్రాడు మాత్రం కలర్ఫుల్ డ్రెస్ లో ఫోజులు కొడుతున్నాడు. చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. అది 2007 తీసిన ఫోటో. టీచర్స్ డే నాడు తమ టీచర్ తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇక ఈ స్కూల్ స్టూడెంట్ ఎవరనే విషయానికి వస్తే.. అతడు టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకడు. చాలా క్రేజీ హీరో. ముక్కు సూటిగా మాట్లాడతాడు. అతడు ఎంచుకునే సబ్జక్ట్స్ కూడా అలానే ఉంటాయి. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో మీరు గుర్తు పట్టారా? చెబితే మీరు జీనియస్.
ఆ యంగ్ బాయ్ మన విశ్వక్ సేన్. 2009లో చైల్డ్ ఆర్టిస్ట్ గా బంగారు బాబు చిత్రం చేశాడు. 2017లో హీరోగా అరంగేట్రం చేశాడు. వెళ్ళిపోమాకే అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వక్ సేన్ కి ఫేమ్ తెచ్చిన చిత్రం మాత్రం ‘ఆ నగరానికి ఏమైంది?’. దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫలక్ నుమా దాస్ తో మాస్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.
దర్శకుడు శైలేష్ కొలను హిట్ టైటిల్ తో క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించాడు. విశ్వక్ సేన్ పోలీస్ రోల్ చేశాడు. విశ్వక్ సేన్ పాత్ర చాలా ఇంటెన్స్ గా సాగుతుంది. హీరో నాని నిర్మించిన హిట్ చిత్రం మంచి విజయం అందుకుంది. అనంతరం చేసిన పాగల్, దాస్ కా దమ్కీ, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ ఏడాది విడుదలైన గామీ తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోర పాత్ర చేయడం విశేషం.
అరుదైన వ్యాధితో బాధపడే అఘోరా చేసే సాహస ప్రయాణమే గామీ చిత్రం. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా కూడా గామీ ఆడింది. ఇక విశ్వక్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్ లో విశ్వక్ అద్భుతంగా నటించాడు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వసూళ్ల పరంగా పర్లేదు అనిపించుకుంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. సినిమా సినిమాకు తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నాడు విశ్వక్ సేన్.