Tata Punch :సేఫ్టీ ఎలక్ట్రిక్‌ కారుగా ‘టాటా పంచ్’.. క్రాష్ టెస్ట్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్.. ఫీచర్లలో, ధరల్లో ది బెస్ట్..

Tata Punch పంచ్ అత్యధిక స్కోరింగ్‌ పొందిన టాటా మొదటి కారుగా నిలిచింది.

Written By: NARESH, Updated On : June 19, 2024 8:04 pm

Tata Punch Facelift

Follow us on

Tata Punch : ఎలక్ట్రిక్ వెహికిల్ (EV) టాటా పంచ్ భారతదేశంలో అత్యంత సురక్షితమైన కారుగా అవతరించింది. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (బీఎన్సీఏపీ లేదా భారత్ ఎన్‌సీఏపీ) నుంచి క్రాష్ టెస్టుల్లో ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. క్రాష్ టెస్ట్‌లో, పెద్దల భద్రత కోసం 32 పాయింట్లకు 31.46, అలాగే, పిల్లల భద్రతకు 49 పాయింట్లకు ఈ కారు 45 పాయింట్లు దక్కించుకుంది.

విశేషం ఏంటంటే.. ఈ కారును కంపెనీ ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన 4 మీటర్ల కంటే తక్కువ శ్రేణిలో దేశపు చౌకన, చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా గుర్తింపు దక్కించుకుంది. టాటా నెక్సాన్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా దక్కించుకుంది. పెద్దల భద్రతకు 32 పాయింట్లకు 29.86 పాయింట్లు, పిల్లల భద్రత కోసం 49 పాయింట్లకు 44.54 దక్కించుకుంది.

మొదటి సారిగా ఎలక్ట్రిక్ కార్ల క్రాష్ టెస్ట్‌ నిర్వహించిన భారత్ ఎన్‌సీఏపీ..
భారత్ ఎన్‌సీఏపీ ఇటీవల రెండు కార్లకు క్రాష్ టెస్ట్ నిర్వహించింది. దాని నివేదిక నిన్న అంటే గురువారం (జూన్ 13)న విడుదల చేసింది. ఒక భారతీయ ఏజెన్సీ ఎలక్ట్రిక్ వాహనానికి (ఈవీ) క్రాష్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ విభాగంలో క్రాష్ టెస్ట్‌లో పాల్గొన్న తొలి ఎలక్ట్రిక్ కారుగా ఇది నిలిచింది.

అదే సమయంలో, పంచ్ అత్యధిక స్కోరింగ్‌ పొందిన టాటా మొదటి కారుగా నిలిచింది. ఇది హారియర్, సఫారి కంటే ఎక్కువ స్కోర్‌ దక్కించుకుంది. ఇది పెద్దల, పిల్లల సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్‌ను సంపాదించుకుంది. ఇది అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది.

22 ఆగస్ట్, 2023న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బీఎన్ సీఏపీని ప్రారంభించారు. ఆ తర్వాత, సెప్టెంబర్ 18, 2023న, పూణెలోని చకాన్‌లో ఉన్న సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (సీఐఆర్‌టీ)లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించింది.