Actress Rambha: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందం తో అభినయం , డాన్స్ అన్నిట్లో అద్భుతం అనిపించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు రంభ గారు..ప్రముఖ దర్శకుడు EVV సత్యనారాయణ గారు తెరకెక్కించిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన రంభ తొలి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టేసింది..దీనితో ఆమెకి అవకాశాలు వరుసగా క్యూ కట్టేశాయి..అతి తక్కువ సమయం లోనే ఆమెకి చిరంజీవి , నాగార్జున , బాలకృష్ణ మరియు వెంకటేష్ వంటి హీరోల సరసన నటించే అవకాశం దక్కింది..లక్కీ గా ఆ సినిమాలన్నీ దాదాపుగా సూపర్ హిట్ అవ్వడం తో స్టార్ హీరోయిన్ గా కూడా ఎదిగిపోయింది..అలా అన్ని ప్రాంతీయ బాషలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ అద్భుతమైన పాత్రలు పోషిస్తూ అశేష ప్రజాభిమానం ని దక్కించుకుంది ఆమె..ఆ తర్వాత ఇంద్రన్ పద్మనాథన్ అనే వ్యక్తిని పెళ్ళాడి ఇండస్ట్రీ లో స్టార్ స్టేటస్ ఉన్న సమయం లోనే సినిమాలకు గుడ్బై చెప్పేసింది..ఈ దంపతులిద్దరికీ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

రంభ గారు చివరిసారిగా వెండితెర మీద చివరిసారిగా కనిపించిన సినిమా యమదొంగ..ఈ చిత్రం లో ఆమె ఎన్టీఆర్ తో కలిసి ‘నాచోరే నాచోరే’ అనే సాంగ్ లో వేసిన స్టెప్పులను అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..ఆ సినిమా తర్వాత ఈమె మళ్ళీ వెండితెర పై కనిపించలేదు..ఇది ఇలా ఉండగా రంభ గారి గురించి గత కొద్దీ రోజుల నుండి సోషల్ ఇండియా లో ఒక వార్త జోరుగా ప్రచారం అవుతుంది..అదేమిటి అంటే ఒకసారి ఈమె తన భర్త తో గొడవలు జరిగినప్పుడు విడాకులు కావాలంటు కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిందట.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి 50 కోట్ల రూపాయిలు ఫైన్ వేసిన ప్రముఖ స్టార్ నిర్మాత

అంతే కాకుండా భరణం క్రింద నెలకు 5 లక్షల రూపాయిలు ఇవ్వాలని..ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని పోషించేందుకు తగిన సాలిడ్ లిక్విడ్ కాష్ కూడా కావాలని రంభ ఆ పిటిషన్ లో పెట్టింది..అయితే ఈ విషయం ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారికి తెలిసింది..రాఘవేంద్ర రావు గారు రంభ గారికి పితృసమానులు మరియు గురువు కూడా..ఆయన రంభ పెట్టిన విడాకుల పిటిషన్ ని వెనక్కి తిరిగి తీసుకునేలా చేసాడట..భార్య భర్తలు అన్న తర్వాత ఇలాంటి గొడవలు సర్వసాధారణమని..సర్దుకొని ముందుకు పోవాలే తప్ప విడాకులు పరిష్కారం కాదని ఆమె నచ్చజెప్పి విడాకులు వెనక్కి తీసుకునేలా చేసాడట..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[…] […]