Laila Movie Review :తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వక్ సేన్ కు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. మంచి కంటెంట్లతో సినిమాలు చేస్తూ ఉంటాడు. తద్వారా ఆయన మంచి విజయాలను కూడా సాధిస్తూ ఉంటాడు. అందుకే ప్రేక్షకులంతా ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన లేడీ గెటప్ లో లైలా గా కనిపించి ప్రేక్షకులను మెప్పించడానికి ఈరోజు థియేటర్లలోకి తీసుకువచ్చాడు.మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హైదరాబాద్ పాతబస్తీలో ఉండే సోను (Vishvak Sen) కి చిన్నప్పటి నుంచి మేకప్ అంటే చాలా ఇష్టం ఉండడంతో అతని ఇష్టాన్ని గుర్తించిన వాళ్ళ అమ్మ అతనికి బ్యూటీ పార్లర్ పెట్టించి చనిపోతుంది. ఇక అప్పటినుంచి ఆయన తన స్కిల్ తో ప్రతి ఒక్కరిని మాయ చేస్తూ ఉంటాడు. మేకప్ తో తన దగ్గరికి వచ్చిన వాళ్లందర్నీ చాలా అందంగా తయారు చేస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే ఆ ఏరియా లో ఉండే ఎస్సై శంకర్ (పృధ్వీ) తన భార్యకు తెలియకుండా ఇంకొక ఆవిడతో ఎఫైర్ పెట్టుకొని ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ విషయాన్ని తన మొదటి భార్యకు చెప్పి తను ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేస్తాడు. దాంతో శంకర్ సోను ను టార్గెట్ చేస్తాడు. ఈ క్రమంలోనే రుస్తుం (అభిమన్యు సింగ్) అనే మరో వ్యక్తి ని బోల్తా కొట్టించి నల్లగా ఉన్న అమ్మాయికి మేకప్ వేసి తెల్లగా మార్చి అతను పెళ్లి చేసుకునేలా చేస్తాడు. ఇక శోభనం రోజున ఆమె మేకప్ తీసేస్తుంది. నల్లగా ఉన్న అమ్మాయిని చూసినా రుస్తుం ఇదంతా ఆ సోను గాడి వల్లే జరిగిందని తెలుసుకుంటాడు.
వాడిని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే కల్తీ ఆయిల్ కేసులో సోను ఇరుక్కుంటాడు. తను నేరం చేయకపోయిన దోషుల అందరి ముందు నిలబడతాడు. ఇక అతనికి శిక్ష పడే సమయంలో ఆయన లేడీ గెటప్ వేసి ‘లైలా’ లా మారుతాడు. తన మీద కక్ష కట్టిన వాళ్లందరిని ఎలా బోల్తా కొట్టించాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ లో పెద్దగా బలం అయితే లేదు. కథ నడుస్తున్నంత సేపు ప్రేక్షకుడికి చాలా వరకు బోర్ అయితే కొట్టిస్తుంది. నిజానికి ఇలాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో ఎవరు తీయలేదు. కారణం ఈ సినిమా అసలు ఎక్కడ కూడా ప్రాపర్ ఎమోషన్ తో అయితే ఉండదు. ఇక దానికి తోడుగా సీన్ కి సీన్ కి అసలు సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రాసుకున్నారు. దానివల్ల సినిమా చూసే ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఫ్రస్టేషన్ కూడా వస్తుంది… దర్శకుడు ఈ సినిమా స్టోరీని విశ్వక్ సేన్ కి ఏ విధంగా చెప్పాడు, ఎలా ఒప్పించాడనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతుంది. మరి ఇలాంటి సినిమా భోజ్ పురి లో కూడా రాదు…
చాలా లో క్వాలిటీ ఎఫర్ట్స్ తో తీసిన ఈ సినిమా ఎక్కడ కూడా ప్రేక్షకుడిని ఎంగేజ్ అయితే చేయకుండా పోయింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఫాల్ట్ అయితే ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దర్శకుడు ఎంచుకున్న కథ కూడా రొటీన్ గా ఉండటం, దాన్ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం వల్ల ఆ కథకి మొదటి నుంచే కనెక్ట్ అవ్వలేడు. ఇక స్క్రీన్ మీద ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోకుండా ప్రేక్షకుడు మధ్యలో నుంచి బయటికి వెళ్లి పరిస్థితి కూడా ఎదురవుతుంది. ప్రాపర్ గా కథ రాసుకొని దాన్ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే విధంగా తీసి ఉంటే లైలా సూపర్ హిట్ అయుండేది. కానీ దర్శకుడు చేసిన మిస్టేక్స్ వల్ల సినిమాని చూడడానికి కూడా వీలు లేనంత దారుణంగా తయారయింది…
ఇలాంటి సినిమాలు విశ్వక్ సేన్ ఉంటే బాగుంటుంది. చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటే ఇలాంటి నాసిరకపు కథలను నమ్ముకొని విశ్వక్ సేన్ సినిమా చేయడం వల్ల ప్రొడ్యూసర్స్ కి విపరీతమైన నష్టం అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ యాక్టింగ్ కొంతవరకు బాగుంది. లైలా గెటప్ లో ఆకట్టుకునే ప్రయత్నమైతే చేశాడు. కానీ సినిమా కథలో దమ్ము లేకపోవడం వల్ల ఆ క్యారెక్టర్ కూడా తేలిపోయింది… గతంలో విశ్వక్ సేన్ చేసిన సినిమాల్లో అతని నటన చాలా న్యాచురల్ గా ఉండేది. కానీ ఈ సినిమాలో మేకప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిగా కనిపించాడు. అందులో మాత్రం తన పర్ఫెక్షన్ ని చూపించడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేసినట్టుగా తెలుస్తోంది…అభిమన్యు సింగ్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. ఇక మిగతా ఆర్టిస్టులందరు కూడా కొంతవరకు నటించే ప్రయత్నమైతే చేశారు. కానీ సినిమాలో ఎక్కడ కూడా ఎవరికి నటించడానికి పెద్దగా స్కోప్ అయితే లేదు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అసలు బాలేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ తో అయినా మ్యూజిక్ డైరెక్టర్ మ్యాజిక్ చేస్తాడా అనుకుంటే అది కూడా లేదు. సినిమా కథలోనే పెద్దగా దమ్ము లేకపోవడంతో మ్యూజిక్ డైరెక్టర్ కూడా లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది… విజువల్స్ పరంగా చూసుకుంటే సినిమాటోగ్రాఫర్ కొంతవరకు తన ఎఫర్ట్ పెట్టి పని చేసినట్టుగా తెలుస్తోంది. సినిమాకి పనిచేసిన ఎంటైర్ టీమ్ లో సినిమాటోగ్రాఫర్ ఒక్కడే కొంచెం తన మార్క్ అనేది చూపించగలిగాడు… ఇక వీళ్లు తీసిన ఔట్ పుట్ ఫుటేజ్ ను చూసిన ఎడిటర్ ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. అందుకే ఆయన ఏ సీన్ ను ఎక్కడ కట్ చేయాలి ఏ లెంత్ లో సెట్ చేయాలి అనేది కూడా మర్చిపోయి తనకు నచ్చినట్టుగా ఎడిటింగ్ అయితే చేసి పెట్టాడు…
ప్లస్ పాయింట్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
కథ
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
అనవసరపు సీన్స్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 1.5/5