Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ తో మాస్ హీరోగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. యూత్ ను ఎంటర్ టైన్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. తనదైన స్టైల్ లో అందరినీ అలరించే ప్రయత్నం చేస్తుంటాడు విశ్వక్ సేన్.
ప్రస్తుతం మస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘లైలా’ అనే యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ యాక్షన్ అండ్ కామెడీ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్లల్లో బిజీగా మారారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
కేవలం తన టాలెంట్‌తో తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు విశ్వక్ సేన్. తను చేసిన సినిమాలకు తోడు ఇప్పటి యువతకు ప్రతిబించే విధంగా కనిపించే అగ్రెసివ్ యాటిట్యూడ్ అతడి ఫాలోయింగ్ పెరగడానికి కారణమైంది. తన సినిమాలను విశ్వక్ సేన్ ప్రమోట్ చేసే తీరు చిత్ర పరిశ్రమలో మిగతా యంగ్ హీరోలకు ఒక పాఠమనే చెప్పాలి. అయితే ప్రమోషన్లు సినిమా ఓపెనింగ్‌కు ఉపయోగపడతాయి.. కానీ అంతిమంగా ఫలితాన్ని నిర్దేశించేది కంటెంటే. కానీ ఈ విషయంలోనే విశ్వక్ సేన్ తడబడుతున్నాడు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ వాటిలో కంటెంట్ గురించి పెద్దగా పట్టించుకుంటున్న సంకేతాలు కనిపించడం లేదు. విశ్వక్ సేన్ లేటెస్ట్ రిలీజ్ ‘లైలా’ తన కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రంగా పేరు తెచ్చుకుంది. తన జడ్జిమెంట్‌ను ప్రశ్నార్థకం చేసింది ఈ చిత్రమే. తన కెరీర్ ఫెయిల్యూర్లు ఉన్నాయి. ఇంతగా విశ్వక్ సినిమా మీద ఇప్పటి వరకు ఎప్పుడూ విమర్శలు వచ్చింది లేదు.
విశ్వక్ సేన్ నెమ్మదిగా ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోతున్నాడనడానికి తన సినిమాలకు వస్తున్న ఓపెనింగే నిదర్శనం. ఏడాది వ్యవధిలో తన సినిమాల ఓపెనింగ్ కలెక్షన్లను పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. గతేడాది మార్చిలో రిలీజైన విశ్వక్ సేన్ మూవీ ‘గామి’ పట్ల ప్రేక్షకుల్లో అమిత ఆసక్తి వ్యక్తం అయింది. దానికి ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.8 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. అయితే విశ్వక్ సేన్ కెరీర్లో అదొక స్పెషల్ మూవీ. దాని కంటెంట్, విజువల్స్ అన్నీ కూడా వేరే లెవెల్లో కనిపించాయి. దాంతో పోలిస్తే తర్వాతి చిత్రం ‘దాస్ కా దమ్కీ’ డే-1 కలెక్షన్లు తగ్గాయి. అయితే రూ.4.5 కోట్లతో అది కూడా బాగానే నడిచింది. విశ్వక్ సేన్ మార్కెట్ స్థాయికి అది కూడా మంచి కలెక్షనే. కానీ గతేడాది చివర్లో వచ్చిన ‘మెకానిక్ రాకీ’కి వసూళ్లు బాగా పడిపోయాయి. తొలి రోజు కోటిన్నర కలెక్షనే రాబట్టింది ‘మెకానిక్ రాకీ’. దానికి యావరేజ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ‘లైలా’ కేవలం 1.25 కోట్ల డే-1 వసూళ్లకు పరిమితం అయింది. ఏడాది కిందట విశ్వక్ సేన్ చిత్రం రూ.8 కోట్లు కొల్లగొడితే.. ఇప్పుడు ఐదో వంతు వసూళ్లే వచ్చాయి. దీనిని బట్టే అర్థం అవుతుంది.. అతడి డౌన్ ఫాల్ ఏ స్థాయిలో ఉందో.