Vishwak Sen Cult Teaser: ‘లైలా’, ‘ఫంకీ’ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత విశ్వక్ సేన్(Vishwak Sen) దర్శకత్వం వహిస్తూ, హీరో గా నటించిన చిత్రం ‘కల్ట్’. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా ఆయనే. డైలాగ్స్ మాత్రం తరుణ్ భాస్కర్ రాశాడు. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ మొత్తం రక్తపాతమే ఉంది, కొరియన్ వెబ్ సిరీస్ లను మొత్తం కలిపి రీమేక్ చేసినట్టుగా అనిపించింది అంటూ ఈ టీజర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. అయితే టీజర్ ప్రారంభం లో మాత్రం తరుణ్ భాస్కర్ మార్క్ డైలాగ్స్ కనిపించాయి. ఒక్క క్షణం ‘ఇదేంటి కల్ట్ టీజర్ అన్నారు..చూస్తుంటే ఈ నగరానికి ఏమైంది లాంటి యూత్ ఫుల్ సినిమా లాగా ఉంది’ అని అంతా అనుకున్నారు.
ఆ తర్వాతే మొదలైంది అసలైన విద్వంసం. టీజర్ ని చూస్తుంటే, ఇందులో ‘కల్ట్’ అనే క్లబ్ లోకి పాసుల ద్వారా లోపల గేమ్స్ ఆడేందుకు వస్తారు జనాలు. అది మామూలు గేమ్స్ కాదు, హింస తో కూడిన గేమ్స్. ఓడిపోయిన వాళ్ళను అడ్డదిడ్డంగా నరికేస్తూ ఉంటారు. ఈ టీజర్ ని చూస్తున్నంతసేపు మనకి నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిల్చిన ‘స్క్విడ్ గేమ్స్’, ‘ఎలైస్ ఇన్ ది బోర్డర్ ల్యాండ్’ వంటి వెబ్ సిరీస్ గుర్తుకొచ్చాయి. ముఖ్యంగా ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ లో ఒక బొమ్మ గేమ్స్ ఎలా ఆడాలో చెప్తూ ఉంటుంది గమనించారా?, సరిగ్గా ఇందులో కూడా ఒక కార్టూన్ బొమ్మ గేమ్స్ గురించి వివరిస్తూ ఉంటుంది. లోపలకు వచ్చిన వాళ్ళు బయటకు ఎలా వెళ్లాలో తెలియక సతమతం అవుతున్న సమయంలో హీరో ఎంట్రీ ఉంటుంది. ఇష్టమొచ్చినట్టు నరికేస్తూ ఉంటాడు హీరో విశ్వక్ సేన్.
ఇంతకీ ఆయన నరుకుతున్నది క్లబ్ లోకి వచ్చిన జనాలనా?, లేదంటే ఆ గేమ్స్ ని కండక్ట్ చేసి అమాయకుల ప్రాణాలను తీస్తున్న వాళ్ళనా? అనేది అసలు అర్థం కాలేదు. ‘స్క్విడ్ గేమ్స్’ ని దాదాపుగా నేటి తరం యూత్ ఆడియన్స్ మొత్తం చూసేశారు. మళ్లీ ఇప్పుడు అదే తిప్పి తీస్తే ఎవరు చూస్తారు చెప్పండి. విశ్వక్ సేన్ పూర్తిగా గాడి తప్పాడు. ఇతను కచ్చితంగా కం బ్యాక్ ఇస్తాడు అనే నమ్మకం కూడా ఈ టీజర్ ని చూసిన తర్వాత పోయింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ టీజర్ మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
Story, Screenplay & Direction – Vishwak Sen pic.twitter.com/knlwbGJGyq
— Aakashavaani (@TheAakashavaani) February 21, 2026