Vishvambhara : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘విశ్వంభర'(Viswambhara Movie) మూవీ కోసం అభిమానులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉండేవి. కానీ ఎప్పుడైతే టీజర్ వచ్చిందో అప్పటి నుండి అంచనాలు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం VFX మీద రీ వర్క్ చేస్తూ మూవీ టీం బిజీ గా ఉంది. రీసెంట్ గా వచ్చిన ఔట్పుట్ పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతృప్తి చెందాడని, త్వరలోనే విడుదల తేదీన అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. జులై నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇకపోతే రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన ప్రోమో సాంగ్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు.
Also Read : ‘విశ్వంభర’ మొదటి పాట విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం!
‘రామ రామా’ అంటూ సాగే పాటలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా డ్యాన్స్ వేశాడు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి(Ramajogayya Sastry) లిరిక్స్ రాయగా, శంకర్ మహదేవన్(Shankar Mahadevan) గాత్రం అందించాడు. చిరంజీవి, శంకర్ మహదేవన్ కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ అన్ని సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి ఆయన చిరంజీవి సినిమాకు పాట పాడాడు. ఇక ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసిన శోభి మాస్టర్(Shobhi Master) ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. ఇకపోతే దాదాపుగా రెండున్నర దశాబ్దం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి(MM Keeravani) మరోసారి చిరంజీవి సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. టీజర్ తో బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకున్న ఈ చిత్రం, కనీసం రేపు విడుదల అవ్వబోయే మొదటి లిరికల్ వీడియో సాంగ్ తో అయినా పాజిటివ్ వైబ్రేషన్స్ ని రప్పిస్తుందా లేదా అనేది చూడాలి.
ఇక ప్రోమో విషయానికి వస్తే చెప్పుకోడానికి పెద్ద గొప్ప ఏమి అనిపించలేదు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ చాలా నాసిరకంగా అనిపించింది. ఇక బీట్ కూడా ఉత్సాహభరితంగా లేదు, నీరసంగా, నిద్ర వచ్చేలా ఉంది. కనీసం పూర్తి పాట అయినా ఇలా ఉండకుండా ఉంటుందో లేదో చూడాలి. ఈ ప్రోమో మొత్తం లో బాగా అనిపించింది ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి లుక్స్. ఆయన లుక్స్ ఇందులో చాలా బాగున్నాయి. హెయిర్ స్టైల్ బాగా సెట్ అయ్యింది. పాట ఒకవేళ యావరేజ్ గా ఉన్నా, మెగాస్టార్ స్టెప్పులతో లాగేస్తాడని అనుకుంటున్నారు అభిమానులు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటిస్తుండగా, ముఖ్య పాత్రలోకి కన్నడ స్టార్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ నటిస్తుంది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి, ఇక ప్రతీ వారం ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందని అంటున్నారు.
Also Read : రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ‘విశ్వంభర’ హిందీ థియేట్రికల్ రైట్స్..’గేమ్ చేంజర్’, ‘దేవర’ కంటే ఎక్కువ!
This Hanuman Jayanthi, let us all turn Ramadoothas and sing the glory of Lord Rama #Vishwambhara First Single #RamaRaama promo out now!
▶️ https://t.co/4Rt3cNTKeIFull song out on 12thApril 11:12 AM ❤️
Music by the Legendary @mmkeeravaani
Lyrics by 'Saraswatiputra'… pic.twitter.com/HF3UHzoXS0— UV Creations (@UV_Creations) April 11, 2025