Homeఎంటర్టైన్మెంట్Vishwak Sen: ఆ యాంకర్ ని చూసి ఫ్లాట్ అయిన విశ్వక్ సేన్... హీరోయిన్స్ కంటే...

Vishwak Sen: ఆ యాంకర్ ని చూసి ఫ్లాట్ అయిన విశ్వక్ సేన్… హీరోయిన్స్ కంటే బెటర్ అంటూ, ఓపెన్ కామెంట్స్

Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ ఫుల్ బిజీ. ఏక కాలంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. విశ్వక్ సేన్ తరచుగా వార్తల్లో ఉంటాడు. మనోడి యాటిట్యూడ్ కారణంగా పలు వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఎవరేమనుకున్నా విశ్వక్ సేన్ తగ్గేదేలే అంటాడు. పతాక శీర్షికలకు ఎక్కేలా ఆయన కామెంట్స్ ఉంటాయి. ఆ మధ్య బేబీ చిత్ర దర్శకుడితో వివాదం నడిచింది. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వార్ జరిగింది. బేబీ మూవీ విశ్వక్ సేన్ తో చేయాలనుకున్నాడు సాయి రాజేష్. కథ వినిపించేందుకు వెళితే… కనీసం కలవలేదట. ఈ విషయాన్ని పేరు ప్రస్తావించకుండా బేబీ విడుదలయ్యాక సాయి రాజేష్ చెప్పాడు.

సాయి రాజేష్ వ్యాఖ్యలకు పరోక్షంగా విశ్వక్ సేన్ సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చాడు. అలా వివాదం మొదలైంది. చెప్పుకుంటూ పోతే విశ్వక్ సేన్ లిస్ట్ లో కాంట్రవర్సీలు చాలానే ఉన్నాయి. తాజాగా ఆయన ఓ యాంకర్ పై క్రేజీ కామెంట్స్ చేశాడు. తన లేటెస్ట్ మూవీ గామి ప్రొమోషన్స్ లో విశ్వక్ సేన్ పాల్గొంటున్నాడు. గామి చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ ఈవెంట్ కి బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు యాంకర్ గా వ్యవహరించారు. ఇక మైక్ తీసుకున్న విశ్వక్ సేన్… ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. స్రవంతి గ్లామర్ కి ఫ్లాట్ అయిన విశ్వక్ సేన్… ఈ మధ్య మీరు హీరోయిన్స్ కంటే మంచి చీరలు కడుతున్నారు.. అని అన్నాడు. దాంతో స్రవంతి మురిసిపోయింది. థాంక్యూ అంటూ కృతజ్ఞతలు తెలిపింది. స్రవంతి చొక్కారపు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాలొన్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్షన్ కాగా… హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయ్యింది. ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే…గామి మార్చి 8న విడుదల కానుంది విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. అలాగే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విశ్వక్ సేన్ తన 10వ చిత్రం కూడా ప్రకటించారు.

 

RELATED ARTICLES

Most Popular