https://oktelugu.com/

బాలీవుడ్ బయోపిక్ కి పవన్ డైరెక్టర్

. మణిరత్నం నిర్మించిన `అంజలి `చిత్రం తో బాల నటుడిగా చిత్ర సీమలోకి ప్రవేశించి ఆ తరవాతి కాలం లో అసిస్టెంట్ దర్శకుడిగా మేటి ఫోటోగ్రాఫర్ మరియు డైరెక్టర్ అయిన సంతోష్ శివన్ వద్ద పని చేసాడు . అలా ఎదిగి అజిత్ హీరోగా ` బిల్లా` ,` ఆరంభం` లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి దర్శకుడి గా మంచి పేరు తెచ్చుకొన్నాడు విష్ణువర్ధన్…. తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా`పంజా` సినిమాను […]

Written By: , Updated On : April 18, 2020 / 06:01 PM IST
Follow us on

.
మణిరత్నం నిర్మించిన `అంజలి `చిత్రం తో బాల నటుడిగా చిత్ర సీమలోకి ప్రవేశించి ఆ తరవాతి కాలం లో అసిస్టెంట్ దర్శకుడిగా మేటి ఫోటోగ్రాఫర్ మరియు డైరెక్టర్ అయిన సంతోష్ శివన్ వద్ద పని చేసాడు . అలా ఎదిగి అజిత్ హీరోగా ` బిల్లా` ,` ఆరంభం` లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి దర్శకుడి గా మంచి పేరు తెచ్చుకొన్నాడు విష్ణువర్ధన్…. తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా`పంజా` సినిమాను రూపొందించాడు. తమిళ నాట స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న ఈ దర్శకుడు ఇపుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ నిర్మాణంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ఓ బయోపిక్ ని తెరకెక్కించ బోతున్నాడు . కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్నShershaah సినిమాతో విష్ణువర్ధన్ బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు .

ఇక ఈ కోలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ విష్ణువర్ధన్ నిర్మించే Shershaah సినిమాలో కీలక ఆర్మీ మేజర్ పాత్ర ఒకటుందట. దాంతో ఈ పాత్రలో నటించవలసిందిగా స్టార్ హీరో అజిత్ ను సంప్రదించగా అజిత్ కి ఆ పాత్ర నచ్చి విష్ణువర్థన్ తో ఓకే చెప్పినట్లు తెలిసింది . అజిత్ ఇదివరకే శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు,. ఇపుడు రెండో సారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించ బోతున్నాడు .ఇంతకీ అసలీ విషయం ఏమిటంటే అజిత్ పుట్ట్టింది హైదరాబాద్ లో, అదీగాక తల్లి సింధీ మహిళా కావడం తో హిందీ బాగా మాట్లాడుతాడు .