Vishnupriya: బోల్డ్ ఫోటో షూట్స్ కి పెట్టింది పేరైన విష్ణుప్రియ చేసిన ఓ హాట్ కామెంట్ వైరల్ గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో నా క్రష్ అన్న ఆమె, అతడు కనిపిస్తే నలిపేస్తా అంటూ పచ్చి కామెంట్ విసిరింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. హాట్ ఫోటో షూట్స్ కి విష్ణుప్రియ కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. ఇంస్టాగ్రామ్ లో విష్ణుప్రియ పోస్ట్ చేసే ఫోటోలు అడల్ట్ స్టార్స్ ని తలపిస్తాయి. అరాకొరా దుస్తుల్లో అర్ధనగ్నంగా విష్ణుప్రియ సెక్సీ ఫోజులతో చంపేస్తూ ఉంటారు. ఈ మధ్య ఈ తరహా ఫోటో షూట్స్ తో ఫేమస్ అయ్యారు.

యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ యాంకర్ గా మారారు. సుడిగాలి సుధీర్ తో పాటు పోవే పోరా షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. పోవే పోరా ఒకింత సక్సెస్ కావడంతో విష్ణుప్రియ వెలుగులోకి వచ్చింది. అయితే అంతకు ముందే విష్ణుప్రియ ఒక బోల్డ్ మూవీలో నటించారు. చెక్ మేట్ టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో విష్ణుప్రియ ఇంటిమసీ సన్నివేశాల్లో రెచ్చిపోయిన నటించింది. బికినీలో అందాల విందు చేసింది.
చాలా కాలం విడుదల కాకుండా ఉన్న చెక్ మేట్ ఓటీటీలో నేరుగా విడుదలైంది. అలాగే ఇటీవల విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో నటించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీలో అనసూయ,దీపికా పిల్లి వంటి బుల్లితెర స్టార్స్ కీలక రోల్స్ చేయడం విశేషం. కాగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న విష్ణుప్రియ టెలివిజన్ కి దూరమయ్యారు.

తాజాగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న లేడీస్ అండ్ జెంటిల్ మెన్ షోకి గెస్ట్ గా విష్ణుప్రియ హాజరైంది. షో యాంకర్ గా ఉన్న ప్రదీప్ మాచిరాజు… నీ క్రష్ ఎవరని విష్ణుప్రియను అడిగారు. దానికి ఆమె తడుముకోకుండా… అక్కినేని అఖిల్ అని చెప్పింది. అఖిల్ అంటే నాకు క్రష్ కనిపిస్తే నలిపేస్తా, అని బోల్డ్ కామెంట్ చేసింది. విష్ణుప్రియ సమాధానానికి షాకైన ప్రదీప్, అఖిల్ భయ్యా ఆ ఏజెంట్ మూవీలో వాడింది నిజమైన గన్ అయితే కాల్చేయ్… అని అన్నాడు. కాగా విష్ణుప్రియ బోల్డ్ కామెంట్ వైరల్ గా మారింది.
ఇటీవల విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఆమె ఫేస్ బుక్ పేజీలో అశ్లీల వీడియోలు, ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఆమె అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలియక విష్ణుప్రియను అభిమానులు అపార్థం చేసుకున్నారు. తర్వాత విష్ణుప్రియ వివరణ ఇచ్చారు. తన ఫేస్ బుక్ అకౌంట్ ని అన్ ఫాలో కావాలంటూ విజ్ఞప్తి చేశారు.