https://oktelugu.com/

Bigg boss telugu season 8: ఓటింగ్ లో దూసుకుపోతున్న విష్ణు ప్రియా.. మరి ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేదేవరు?

విష్ణు ప్రియా అదే మొదటి వారం నుంచి టాప్ లోనే ఉంది. సోనియా ఎన్ని మాటలు అన్నా కూడా విష్ణు ఆమెని ఏమి అనలేదు. గౌరవంగానే ఆమెతో మాట్లాడిందని విష్ణు ని అందరూ అభినందిస్తున్నారు. ఈ సారి బిగ్ బాస్ విన్నర్ కూడా విష్ణు ప్రియా అని అందరూ భావిస్తున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 11, 2024 / 08:39 PM IST

    Bigg boss telugu season 8

    Follow us on

    Bigg boss telugu season 8:  ఈ సీజన్ లో అందరూ కూడా పెద్దగా తెలియని కంటెస్టెంట్స్ ఉన్నారు. మిగతా సీజన్ లతో పోలిస్తే.. ఈ సీజన్ ఎవరికీ కూడా పెద్దగా నచ్చడం లేదు. అయితే మొదటి వారం హౌస్ నుంచి బెజవాడ బేబక్క బయటకు వచ్చేసారు. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటికి వస్తారంటే.. ఎక్కువగా కిరాక్ సీత పేరే వినిపిస్తుంది. ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆదిత్య ఓం, నిఖిల్, పృథ్వీ, నాగ మణికంఠ, కిర్రాక్ సీత, విష్ణు ప్రియ, నైనిక నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఒక్కరోజు ఓటింగ్ చూసుకుంటే విష్ణు ప్రియ టాప్ లో ఉంది. సోనియా విష్ణు ప్రియను అన్న మాటలకి అందరూ కూడా ఆమెకి ఓట్లు వేస్తున్నారు. ఎందులో చుసిన కూడా విష్ణు ప్రియ ఓటింగ్‌తో టాప్ ఉంది. గతవారం మణికంఠ సింపథి గేమ్ బాగానే సెట్ అయ్యింది. నెటిజన్లు మణికంఠకి ఓట్లు వేసేశారు. విష్ణు ప్రియతో పోటీగా మణికంఠకి ఓట్లు వేశారు. అయితే విష్ణు ప్రియా అదే మొదటి వారం నుంచి టాప్ లోనే ఉంది. సోనియా ఎన్ని మాటలు అన్నా కూడా విష్ణు ఆమెని ఏమి అనలేదు. గౌరవంగానే ఆమెతో మాట్లాడిందని విష్ణు ని అందరూ అభినందిస్తున్నారు. ఈ సారి బిగ్ బాస్ విన్నర్ కూడా విష్ణు ప్రియా అని అందరూ భావిస్తున్నారు. ఎందుకు అంటే నిఖిల్ సోనియా వల్ల గేమ్ సరిగ్గా ఆడటం లేదు. కాబట్టి ఈసారి విష్ణు ప్రియా టైటిల్ కొట్టె ఛాన్స్ ఉంది.

    ఈ వారం విష్ణు ప్రియ 26 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉంది. విష్ణు ప్రియా తరువాత రెండో స్థానంలో నిఖిల్ 24 శాతం ఓటింగ్‌తో ఉన్నాడు. 15 శాతం ఓట్లతో నాగ మణికంఠ మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత నాలుగో స్థానంలో నైనిక 10 శాతం ఓట్లతో ఉంది. ఇక 9 శాతం ఓట్లతో శేఖర్ బాషా ఐదో స్థానంలో ఉంటే.. ఆదిత్య ఓం 8 శాతం ఓట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. ఇక 6 శాతం ఓట్లతో సీత, పృథ్వీ ఉన్నారు. పృథ్వీ కంటే కిరాక్ సీత చాలా బాగా ఆడుతుంది. హౌస్ లో తన వాయిస్ కూడా రైజ్ చేస్తుంది. గేమ్స్ లో మంచిగా ఆడటంతో పాటు అన్నిటిలో బాగా ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఈ సారి హౌస్ నుంచి కిరాక్ సీత బయటకి వచ్చే అవకాశం ఉందని ఎక్కువగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఓటింగ్ ప్రకారం అయితే పృథ్వీ హౌస్ నుంచి బయటకు వెళ్లాలి. కానీ బిగ్ బాస్ అలా జరగనిస్తారా అనేది చాలా మందికి సందేహం. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారో చూడాలి.