Homeఎంటర్టైన్మెంట్Vishal: మాజీ ప్రేయసి వరలక్ష్మి నిశ్చితార్థం పై హీరో విశాల్ ఊహించని కామెంట్స్!

Vishal: మాజీ ప్రేయసి వరలక్ష్మి నిశ్చితార్థం పై హీరో విశాల్ ఊహించని కామెంట్స్!

Vishal: నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల నిశ్చితార్థం జరుపుకోగా నటుడు విశాల్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల గ్యాలరిస్ట్ అయిన నికోలస్ సచ్ దేవ్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుంటుంది. ఆమె తల్లిదండ్రులు రాధిక, శరత్ కుమార్ ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. బంధు మిత్రులు వరలక్ష్మి-నికోలస్ నిశ్చితార్థం వేడుకలో సందడి చేశారు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. వరలక్ష్మి, నికోలస్ చాలా ఆనందంగా కనిపించారు.

త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. కాగా వరలక్ష్మి ఎంగేజ్మెంట్ పై హీరో విశాల్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ… వరలక్ష్మి వివాహ బంధంలో అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆమెకు నా శుభాకాంక్షలు. నటిగా ఆమె చేరుకోవాలనుకున్న లక్ష్యం చేరుకుంది. తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హనుమాన్ మూవీలో వరలక్ష్మి ఫైట్స్ కూడా చేయడం బాగుందని… అన్నారు.

కాగా పందెం కోడి 2, మదగజ రాజా చిత్రాల్లో వరలక్ష్మి శరత్ కుమార్, విశాల్ కలిసి నటించారు. వీరు చాలా కాలం ప్రేమలో ఉన్నట్లు పుకార్లు ఉన్నాయి. విశాల్ బర్త్ డే ని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసింది. దాంతో రూమర్స్ కి బలం చేకూరింది. అయితే తాము స్నేహితులమే అని వరలక్ష్మి శరత్ కుమార్ క్లారిటీ ఇచ్చింది. వీరి మధ్య విబేధాలు ఏర్పడినట్లు సమాచారం. అలాగే విశాల్ తో రాధిక, శరత్ కుమార్ కూడా గొడవలు పడ్డారు.

నడిగర్ సంఘం ఎన్నికల విషయంలో విశాల్ పై శరత్ కుమార్, రాధిక విమర్శలు చేశారు. విడిపోయాక వరలక్ష్మి-విశాల్ కలిసి కనిపించింది లేదు. ఈ క్రమంలో వరలక్ష్మి పెళ్లి పై విశాల్ స్పందించడం విశేషంగా మారింది. ఇక తెలుగులో విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ దూసుకుపోతుంది . క్రాక్, యశోద, వీరసింహారెడ్డి చిత్రాల్లో విలన్ గా వరలక్ష్మి అద్భుత నటన కనబరిచింది. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ లో హీరో తేజ సజ్జా అక్క పాత్ర చేసింది.

RELATED ARTICLES

Most Popular