Vishal saamanyudu movie: తమిళ స్టార్ హీరో విశాల్, డింపుల్ హయతి జంటగా నటించిన కొత్త సినిమా ‘సామాన్యుడు’. కాగా ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ను ఇచ్చారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విశాల్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందట. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది.
Vishal Saamanyudu Movie
ఇక ఈ సినిమా ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనే ఉపశీర్షికతో రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ ను చూస్తుంటే ఇదొక ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఇక యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు ప్లస్ అవుతుందని చెబుతున్నారు మేకర్స్. ట్రైలర్ లో కూడా యువన్ తన మార్క్ ను చూపించాడు. ముఖ్యంగా యువన్ బీజీఎం అదిరిపోయింది.
Also Read: ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న మోహన్ బాబు, బ్రహ్మానందం !
‘మీకు ఒక మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా అంటూ విశాల్ వాయిస్ తో స్టార్ట్ కానున్న ఈ సినిమా పై విశాల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కారణం.. ఈ సినిమాకి విశాలే నిర్మాత. అప్పు చేసి మరీ ఈ సినిమాను చేశాడు. తన ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’పై నిర్మిస్తున్న ఈ సినిమా చాలా బాగా ఆకట్టుకుంటుంది అని విశాల్ నమ్మకంగా ఉన్నాడు. ఏది ఏమైనా తమిళ స్టార్ హీరో విశాల్ ఎప్పుడూ విభిన్నమైన సినిమాలే చేస్తుంటాడు.
అందుకే విశాల్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు మంచి సినిమాలను చేశాడు. కాగా ఈ సినిమాలో రొమాంటిక్ అంశాలు ఉన్నప్పటికీ అంతకుమించి యాక్షన్ సీన్లు ఉన్నాయట. ఎలాగూ యాక్షన్, ఎమోషనల్ సీన్లలో విశాల్ చాలా బాగా నటిస్తాడు. కాబట్టి.. ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ లే ఎక్కువ. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read: రాధేశ్యామ్’, ‘రామారావు’, ‘కేజీఎఫ్ -2’ రిలీజ్ డేట్స్ ఫిక్స్ !
Glad to announce that #VVS has been censored with U/A! #VVSFromFeb4th #SaamanyuduFromFeb4th #ObbaFromFeb4th #VeeramaeVaagaiSoodum pic.twitter.com/GNAP5ssXQx
— Vishal (@VishalKOfficial) February 2, 2022