Vishal Madras High Court: తమిళ హీరో విశాల్(Vishal Reddy) ఇప్పుడు పూర్తిగా చిక్కుల్లో పడ్డాడు. గత రెండు రోజుల క్రితమే మనం ధనుష్ ‘నాన్ రుద్రన్’ అనే సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడని, ఇప్పటి వరకు సినిమా చెయ్యలేదు కాబట్టి, మేము ఇచ్చిన అడ్వాన్స్ వడ్డీ తో సహా తిరిగి ఇవ్వాలంటూ నిర్మాత డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలాంటి సంఘటనే హీరో విశాల్ విషయం లో కూడా జరిగింది. 2022 వ సంవత్సరం లో ఆయన ఒక సినిమాలో హీరో గా నటించడానికి ఒప్పుకున్నాడు. అందుకోసం పది కోట్ల రూపాయిల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా చెయ్యలేదు. దీంతో ఆ నిర్మాత తిరగబడి విశాల్ తనకు అడ్వాన్స్ వడ్డీ తో సహా 21 కోట్ల రూపాయిలు చెల్లించాలని మద్రాసు హై కోర్టు లో పిటీషన్ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
విశాల్ తక్షణమే లైకా ప్రొడక్షన్స్ సంస్థకు 10 కోట్ల రూపాయిలు డిపాజిట్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. విశాల్ తనకు ఆరు వారాల సమయం కావాలని కోర్టు లో పిటీషన్ పెట్టగా, ఆయన రిక్వెస్ట్ ని హై కోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో విశాల్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. చేతిలో ఒకప్పటి రేంజ్ లో సినిమాలు లేవు, ఇప్పటికిప్పుడు పది కోట్ల రూపాయిలు అంటే ఆయనకు చాలా కష్టమైన పని. ఒకవేళ 10 కోట్లు చెల్లించకపోతే న్యాయపరమైన చర్యలు తప్పేలా లేవు. అరెస్ట్ కూడా అవ్వొచ్చు అంటూ తమిళ సినీ పరిశ్రమలో జోరుగా ఒక వార్త వినిపిస్తోంది. మరి విశాల్ ఏమి చేయబోతున్నాడో చూడాలి. రీసెంట్ గానే ఆయన ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సిక ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన కొత్తల్లోనే ఇలాంటి సంఘటన ఎదురు అవ్వడం దురదృష్టకరం, దీనిని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.
ఇకపోతే విశాల్ చివరి సారిగా వెండితెర పై కనిపించిన చిత్రం ‘మధ గజ రాజా’. గత ఏడాది ఈ చిత్రం విడుదలైంది. ఎప్పుడో 13 ఏళ్ళ క్రితం తెరకెక్కిన ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల అప్పట్లో విడుదల చేయలేకపోయారు. కానీ విశాల్ చొరవ తీసుకొని గత ఏడాది సంక్రాంతి కానుకగా తన సొంత ప్రొడక్షన్ లో విడుదల చేశాడు. పెద్ద హిట్ అయ్యింది. అంతకు ముందు ఆయన రత్నం, మార్క్ ఆంటోనీ వంటి చిత్రాలు చేశాడు. మార్క్ ఆంటోనీ కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టింది, కానీ రత్నం మాత్రం ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం విశాల్ చేతిలో మగుడం , పురుషన్, తుప్పర్ వాలన్ వంటి చిత్రాలు ఉన్నాయి.