Virupaksha Collections : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’ ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.విడుదలకు ముందు నుండే ప్రేక్షకులను మరియు అభిమానులను టీజర్ మరియు ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన దానికంటే ఎక్కువ అద్భుతాలు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.
మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, రెండవ రోజు ఏకంగా 7 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.నిన్న రంజాన్ అవ్వడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది.అయితే రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ఈ సినిమా ఆ రోజు మరో అరుదైన రికార్డు నెలకొల్పింది.అది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
అసలు విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ మూవీ రెండవ రోజు సాధించిన వసూళ్ల కంటే విరూపాక్ష ఎక్కువ వసూళ్ళని సాధించింది అట.’వీర సింహా రెడ్డి’ చిత్రానికి రెండవ రోజు 5 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.కానీ ‘విరూపాక్ష’ చిత్రం ఏకంగా 5 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది అనే చెప్పాలి.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇలాంటి కలెక్షన్స్ ని రాబట్టడమే అంటే సాధారణమైన విషయం కాదు.మరో పక్క ఓవర్సీస్ లో ఈ సినిమా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ కలెక్షన్స్ ని డామినేట్ చేస్తుంది.అలా ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోల రికార్డ్స్ ని కొల్లగొట్టడం సాయి ధరమ్ తేజ్ రేర్ ఫీట్ అనే చెప్పొచ్చు.రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.