https://oktelugu.com/

Virupaksha Collections: హిందీ లో ‘విరూపాక్ష’ కి సున్నా వసూళ్లు..ఈ రేంజ్ వైఫల్యానికి కారణం అదేనా!

కానీ కొన్ని సినిమాలు కంటెంట్ అద్భుతంగా ఉన్నప్పటికీ కలెక్షన్స్ రావడం లేదు, అందుకు రీసెంట్ ఉదాహరణ 'విరూపాక్ష'.

Written By: , Updated On : May 12, 2023 / 02:17 PM IST
Virupaksha
Follow us on

Virupaksha Collections: ఈ సమ్మర్ లో పెద్ద హీరోల సినిమాలు విడుదల ఏది లేకపోవడం తో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన హారర్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించింది. ఈ చిత్రం మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచే వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకెళ్లింది. అయితే ఈమధ్య తెలుగు సినిమాలు హిందీ లో ఇరగదీసినవి చాలానే ఉన్నాయి.

పుష్ప, కార్తికేయ 2 చిత్రాలు అందుకు ఉదాహరణ. సీతారామం చిత్రం కూడా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. ఈ సినిమాలను చూసి మన మేకర్స్ ఈమధ్య బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు విడుదల చెయ్యడం ప్రారంభించారు. కానీ కొన్ని సినిమాలు కంటెంట్ అద్భుతంగా ఉన్నప్పటికీ కలెక్షన్స్ రావడం లేదు, అందుకు రీసెంట్ ఉదాహరణ ‘విరూపాక్ష’.

ఈ చిత్రాన్ని రీసెంట్ గానే హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో విడుదల చేసారు. అన్నీ భాషల్లోనూ ఈ చిత్రానికి చాలా మిశ్రమ స్పందన లభించింది. తెలుగు లో విడుదలైన రోజే హిందీ మరియు తమిళ బాషలలో విడుదల చేసి ఉంటే మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేది ఏమో కానీ, ఇక్కడ విడుదలైన పది రోజుల తర్వాత ఇతర బాషలలో విడుదల చెయ్యడం ఈ చిత్రానికి మైనస్ అయ్యింది.

పైగా ప్రొమోషన్స్ విషయం లో కూడా మేకర్స్ పెద్దగా పట్టించుకోలేదు, అందుకే వసూళ్లు రాలేదు. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఇప్పటి వరకు ‘విరూపాక్ష’ చిత్రానికి హిందీ లో వచ్చిన వసూళ్లు సున్నా అట. తెలుగు లో 46 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసి 50 కోట్ల వైపు దూసుకుపోతున్న ఈ సినిమాకి హిందీ లో ఇలాంటి పరాభవం ఎదురు అవ్వడం మూవీ టీం బ్యాడ్ లక్ అనే చెప్పాలి.