https://oktelugu.com/

Virata Parvam Movie: ఇంకా అజ్ఞాతంలోనే మగ్గిపోతున్న ‘విరాటపర్వం’

Virata Parvam Movie: ‘విరాటపర్వం’ అని ఏమంటా పేరు పెట్టారో గానీ, దాదాపు మూడేళ్లుగా అజ్ఞాతంలోనే మగ్గిపోతూ ఉంది ఈ సినిమా. రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వస్తోన్న ఈ ‘విరాటపర్వం’ పై మంచి అంచనాలు ఉన్నాయి. మూడేళ్ళ క్రితమే విడుదల తేదీ ప్రకటించినా.. ఇంకా ఈ సినిమా విడుదల కాలేదు. ఎప్పుడో షూటింగ్ పూర్తి అయింది. ఫస్ట్ కాపీ చేతికి వచ్చి కూడా రెండేళ్లు అవుతుంది. అయినప్పటికి ఇంకా నిర్మాతలు ఈ సినిమాను […]

Written By:
  • Shiva
  • , Updated On : March 22, 2022 / 11:34 AM IST
    Follow us on

    Virata Parvam Movie: ‘విరాటపర్వం’ అని ఏమంటా పేరు పెట్టారో గానీ, దాదాపు మూడేళ్లుగా అజ్ఞాతంలోనే మగ్గిపోతూ ఉంది ఈ సినిమా. రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వస్తోన్న ఈ ‘విరాటపర్వం’ పై మంచి అంచనాలు ఉన్నాయి. మూడేళ్ళ క్రితమే విడుదల తేదీ ప్రకటించినా.. ఇంకా ఈ సినిమా విడుదల కాలేదు. ఎప్పుడో షూటింగ్ పూర్తి అయింది. ఫస్ట్ కాపీ చేతికి వచ్చి కూడా రెండేళ్లు అవుతుంది.

    virata parvam

    అయినప్పటికి ఇంకా నిర్మాతలు ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చెయ్యాలా? లేక ఓటీటీలో రిలీజ్ చేద్దామా ? అన్న డైలమాలోనే ఉండిపోయారు. థియేటర్లు అన్ని ఓపెన్ అయ్యాక.. చిత్ర బృందానికి రిలీజ్ విషయంలో ఇంకా ఒక స్పష్టత లేకపోవడం ఆశ్చర్యకరమే. షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ సినిమా ఇంకా విడుదలకు మాత్రం నోచుకోకపోవడం నిర్మాతలకు బాధాకరమైన విషయమే.

    Also Read:  ‘కొత్త బంగారు లోకం’ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో కుమారుడు

    మొదట్లో కరోనా కారణంగా చాలా రోజులు వాయిదా పడింది ఈ సినిమా. కానీ, ఇప్పుడు సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతున్నాయి కదా ? ఎందుకు ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికీ క్లారిటీ రాలేదు అని రానాను కదిలిస్తే.. నాకు సంబంధం లేదని రానా చెబుతున్నాడట. రానా టీమ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా అవుట్ ఫుట్ విషయంలో రానా హ్యాపీగా లేడు.

    అందుకే, ఈ సినిమా రిలీజ్ పై రానా మొదటి నుంచి ఆసక్తిగా లేడు. నిజానికి మొన్నటి వరకు ‘భీమ్లా నాయక్’ రిలీజ్ తర్వాత తన ‘విరాటపర్వం’ గురించి రానా ఆలోచిస్తాడేమో అని ఓ ప్రచారం జరిగింది. ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయిన తర్వాత మాత్రం రానా ఈ సినిమా రిలీజ్ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు.
    మరి ‘విరాటపర్వం’ను సమ్మర్ లో రిలీజ్ చేద్దామా ? అంటూ దర్శక నిర్మాతలు అడిగితే.. ఈ సినిమాకు ఓటీటీనే బెటర్ అంటూ రానా చెప్పినట్లు తెలుస్తోంది.

    Virata Parvam Movie

    అందుకే, మొదటి నుంచి “విరాటపర్వం” సినిమాను నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చేయాలని ఆ మధ్య రానా చాలా ప్రయత్నం చేశాడు. కానీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు ఒప్పుకుంటే తనకు కొన్ని సమస్యలు వస్తాయని, అప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేశాడు సురేష్ బాబు. మరి ఇప్పటికైనా విరాటపర్వం చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయడానికి సురేష్ బాబు ఒప్పుకుంటాడేమో చూడాలి. మొత్తానికి రిలీజ్ విషయంలో “విరాటపర్వం” గందరగోళంలో ఉంది.

    Also Read: మళ్ళీ తండ్రి కాబోతున్న దిల్ రాజు

    Recommended Video:

    Tags