Viral Video : స్టార్ మా(Star Maa) ఛానల్ లో గత ఏడాది ప్రసారమైన ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్'(Kiraak Boys Kiraak Ladies) మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ ద్వారా దాదాపుగా నలుగురు బిగ్ బాస్ 8 లోకి అడుగుపెట్టారు. మొదటి సీజన్ పెద్ద హిట్ అవ్వడంతో రెండవ సీజన్ ని కూడా రీసెంట్ గానే మొదలు పెట్టారు. ఈ సీజన్ కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. టీఆర్ఫీ రేటింగ్స్ భారీ స్థాయిలో వస్తున్నాయి. ఈ సీజన్ కూడా మొదటి సీజన్ లాగానే ఫన్ మరియు ఎమోషన్స్ తో నడుస్తుంది. ప్రస్తుతానికి అయితే అబ్బాయిలకంటే అమ్మాయిలు పైచేయి సాధించారు. గత సీజన్ లో అబ్బాయిలు కప్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ ఆదివారం ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read : దేవర 2 లో మహేష్ బాబు నటిస్తున్నాడా.?క్లారిటీ ఇచ్చిన దర్శకుడు…
ఈ ప్రోమో ప్రారంభం మొత్తం చాలా ఫన్నీ గా అనిపించింది. ఈ వారం మూవీ థీమ్ కావడంతో కంటెస్టెంట్స్ అందరూ పాపులర్ మూవీ క్యారెక్టర్స్ గెటప్స్ లో దర్శనమిచ్చారు. ఇమ్మానుయేల్, సింగర్ సాకేత్, రాజు తదితరులు పండించిన కామెడీ బాగా పేలింది. అంత బాగా వెళ్తుంది అంటుకుంటున్న సమయంలో మానస్ మరియు హమీద కి మధ్య గొడవ జరగడం హాట్ టాపిక్ గా మారింది. ఇరువురి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు మానస్ అమ్మాయిలు తొండి ఆట ఆడుతున్నారు అని అంటాడు. అప్పుడు జబర్దస్త్ ఐశ్వర్య మీవాడు కూడా ఇందాక అలాగే చేసాడు కదా అని అంటుంది. ఆ తర్వాత చాలా వాదన జరిగినట్టు ఉంది, ప్రోమోలో మనకి అది చూపించలేదు కానీ, హమీద మాత్రం చాలా ఫైర్ అయ్యింది. అమ్మాయిల గెలుస్తున్నారంటే చాలు మీకు కొత్త పాయింట్స్ గుర్తుకొస్తాయి అని మండిపడుతుంది.
అప్పుడు మానస్ ‘తొండి ఆట ఆడి గెలవడం కాదబ్బా, నిజాయితీగా ఆడి గెలవండి..నువ్వు సెన్స్ తో మాట్లాడితే నీకు సమాధానం చెప్తాను..సెన్స్ లేకుండా మాట్లాడితే అసలు సమాధానం చెప్పను’ అంటూ హమీద పై ఫైర్ అవుతాడు మానస్. బయట హమీద, మానస్ మంచి స్నేహితులు. వీళ్లిద్దరు బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. హౌస్ లో ఉన్నప్పుడే వీళ్లిద్దరి మధ్య ఎదో జరుగుతుంది అంటూ రూమర్స్ వచ్చాయి. అంత క్లోజ్ గా ఉండేవాళ్లు. బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన తర్వాత మానస్ ‘బ్రహ్మముడి’ సీరియల్ చేసాడు. ఇది ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ లో స్వప్న గా హమీద నటించింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈమధ్య కాలంలోనే హమీద ఆ సీరియల్ నుండి తప్పుకుంది. అలా బయట ఎంతో మంచి స్నేహితులైన వీళ్లిద్దరు కేవలం ఒక షో కోసం కొట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.