Viral Video : నేటి తరం యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టడానికి అడుగు దూరంలో ఉన్న హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే అది విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) అని చెప్పొచ్చు. వీళ్లిద్దరు జీరో బ్యాక్ గ్రౌండ్ నుండే తమ కెరీర్స్ ని మొదలు పెట్టారు. చూస్తూ ఉండగానే అంచలంచలుగా ఎదుగుతూ నేడు ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే గతంలో వీళ్లిద్దరు కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం'(Yevade Subramanyam) అనే సినిమా చేసారు. నాని అప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ని సంపాదించుకొని, ఒక మంచి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరోగా ఉన్నాడు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం అప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్త హీరో. అందుకే ఈ సినిమాలో ఆయన ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఒకవిధంగా చెప్పాలంటే హీరో నాని క్యారక్టర్ ని కూడా విజయ్ దేవరకొండ డామినేట్ చేశాడు.
Also Read : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సీక్వెల్ కి రచయితగా మారిన యంగ్ హీరో..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!
ఈ సినిమానే ఆయనకు మొదటి చిత్రం అనుకోవచ్చు. ఈ చిత్రానికి ముందు ఆయన ‘నువ్విలా’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వంటి చిత్రాల్లో నటించాడు కానీ, ఎవ్వరూ గుర్తు కూడా పట్టలేని రేంజ్ పాత్రలు అవి. తన నటనని పూర్తి స్థాయిలో బయటపెట్టి, ఎవరీ కుర్రాడు చూసేందుకు చాలా బాగున్నాడు, బాగా నటిస్తున్నాడు అని ఇతని గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇక ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత అతని రేంజ్ ఎలా మారిపోయిందో మన అందరికీ తెలిసిందే. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వీళ్లిద్దరి సన్నివేశాలను చూస్తుంటే, సరిసమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు కలిసి మరోసారి నటిస్తే చూడాలని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకి దర్శకుడు మరెవరో కాదు, మన ‘కల్కి’ దర్శకుడు నాగ అశ్విన్.
అయితే సోషల్ మీడియా లో విజయ్ దేవరకొండ, నాని అభిమానులు ఏ రేంజ్ లో ఫ్యాన్ వార్స్ చేసుకుంటారో మనం ప్రతీరోజు చూస్తూనే ఉన్నాం. తమ హీరో పై నాని కావాలని తన పీఆర్ టీం తో నెగటివ్ చేయిస్తున్నాడని విజయ్ ఫ్యాన్స్, లేదు మా హీరో మీద కక్ష గట్టి విజయ్ దేవరకొండ నెగటివ్ పబ్లిసిటీ చేయిస్తున్నాడని నాని ఫ్యాన్స్, గత కొద్దిరోజులుగా తిట్టుకుంటూ ఉన్నారు. నాని,విజయ్ దేవరకొండ మధ్య కూడా ఒకప్పుడు ఉన్న స్నేహం ఇప్పుడు లేదని చాలా మంది అనుకున్నారు. కానీ వీళ్లిద్దరు ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నారని లేటెస్ట్ గా విడుదల చేసిన ఒక వీడియో ద్వారా తమ అభిమానులకు చెప్పకనే చెప్పారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని త్వరలోనే రీ రిలీజ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ, నాని, హీరోయిన్ మాళవిక నాయర్ బైక్ మీద కూర్చొని పాత పోస్టర్ స్టిల్ ని రీ క్రియేట్ చేసారు. అందుకు సంబంధించిన వీడియో ని మీరు కూడా చూసేయండి.
