Viral Video : అభిమానుల అతి ప్రేమ కారణంగా కొంతమంది సెలబ్రిటీలు అనేక ఇబ్బందులను ఎదురుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది వరకు అలాంటి సందర్భాలను మనం చాలానే చూసాము. ఒక హీరోయిన్ కానీ, హీరో కానీ జనాల్లోకి వస్తే, వాళ్ళను పట్టుకోవడానికి అభిమానులు దూసుకెళ్లడం వల్ల, సదరు హీరో/హీరోయిన్ క్రిందకు పడిపోయి గాయాలు పాలవ్వడం వంటివి జరిగాయి. అందుకే సెలబ్రిటీలు బయటకు వచ్చేటప్పుడు భారీ సెక్యూరిటీ తో వస్తుంటారు. అయినప్పటికీ కూడా అభిమానుల అత్యుత్సాహం కారణంగా సెలబ్రిటీలు తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకోవాల్సి వస్తుంది. రీసెంట్ గా అలాంటి సంఘటన యంగ్ బ్యూటీ శ్రీలీల(Heroine Sree Leela) విషయంలో జరిగింది. ఆమెని ఒక అభిమాని చెయ్యి పట్టుకొని లాగి పక్కకి తీసుకెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మిడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read : ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సమంత..మొదటి పోస్ట్ అతనిపైనే!
పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు(Anurag Basu) దర్శకత్వం లో కార్తిక్ ఆర్యన్(Karthik Aaryan), శ్రీలీల హీరో హీరోయిన్లుగా ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు, ఒక గ్లింప్స్ వీడియో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇది కాసేపు పక్కన పెడితే రీసెంట్ గానే శ్రీలీల ఈ మూవీ టీం తో కలిసి డార్జిలింగ్ కి వెళ్ళింది. అక్కడ షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతుంది. అయితే రీసెంట్ గా ఏర్పాటు చేసిన ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కోసం శ్రీలీల ని చూసేందుకు చాలా మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. శ్రీలీల హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి నవ్వుతూ నడుచుకుంటూ, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో ఒక అభిమాని అత్యుత్సాహం చూపించి శ్రీలీల చెయ్యి పట్టుకొని వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు.
ఒక్కసారిగా ఎవరో తెలియని ఒక అజ్ఞాత వ్యక్తి అలా పబ్లిక్ లో అందరి ముందు చెయ్యి పట్టుకొని లాగితే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. శ్రీలీల కూడా ఈ సంఘటన కారణంగా షాక్ కి గురి అయ్యింది. అనంతరం అతని నుండి తన చేతులు విడిపించుకొని మళ్ళీ నవ్వుతూనే నడుచుకుంటూ వెళ్ళింది శ్రీలీల. అందుకు సంబంధించిన వీడియో ని క్రింద అందిస్తున్నాం. చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇకపోతే టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది శ్రీలీల. కానీ ఆ తర్వాత ఎందుకో ఈమె చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్స్ అవుతూ వచ్చాయి. కేవలం ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయి. రీసెంట్ గా విడుదలైన ‘రాబిన్ హుడ్’ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో ఇప్పుడు శ్రీలీల కెరీర్ మరోసారి రిస్క్ లో పడినట్టు అయ్యింది. టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమెకు అవకాశాలు రావడం లేదు కానీ, బాలీవుడ్ లో మాత్రం ఫుల్ బిజీ గా గడుపుతుంది.
Also Read : రష్మిక పుట్టినరోజుకు అరుదైన బహుమతి అందించిన విజయ్ దేవరకొండ..ఫోటోలు వైరల్!
