Samantha Ruth Prabhu
Samantha : సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). ఇన్ స్టాగ్రామ్ లో ఈమె ప్రతీ రోజు ఎదో ఒక పోస్టులు, స్టోరీలు పెడుతూనే ఉంటుంది. అభిమానులతో నిత్యం ఇంటరాక్ట్ అయ్యే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు ఈమె. ఇన్ స్టాగ్రామ్ ని ఇప్పుడు ఎంత బాగా ఉపయోగిస్తుందో, ఒకప్పుడు ట్విట్టర్ ని కూడా అదే రేంజ్ ఉపయోగించేది. ట్విట్టర్ సంగతి మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఉండే అన్ని యాప్స్ కంటే ఈ యాప్ నుండే అత్యధిక నెగటివిటీ ని సెలబ్రిటీలు ఎదురుకుంటూ ఉంటారు. సమంత కూడా ట్విట్టర్ ద్వారా అలాంటి నెగటివిటీ ని ఎదురుకుంటూ వచ్చింది. ఇక ఆమె అనారోగ్యం పాలైన తర్వాత ట్విట్టర్ అకౌంట్ వాడడం బాగా తగ్గించేసింది. కానీ ఇప్పుడు మరోసారి ఆమె ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.
Also Read : రామ్ చరణ్ రికార్డుని కొట్టేందుకు ప్రాణాలమీదకు తెచ్చుకున్న అజిత్ ఫ్యాన్స్!
వచ్చిన వెంటనే ఆమె ఒక అమాయకుడికి సంబంధించిన వీడియో ని అప్లోడ్ చేసింది. మనకు తెలియని ఆ అమాయకుడు ఎవరబ్బా అని అనుకుంటున్నారా?, అది సమంత నిజ జీవితంలోని అమాయకుడు గురించి చెప్పలేదు, ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం'(Subham Teaser) అనే చిత్రం టీజర్ గురించి అన్నమాట. ఆ టీజర్ ని ఆమె తన ట్విట్టర్ ఖాతా నుండి అప్లోడ్ చేయగానే, వేల సంఖ్యలో రీట్వీట్స్, లైక్స్, కామెంట్స్ వచ్చాయి. చాలా కాలం తర్వాత సమంత నుండి వచ్చిన పోస్ట్ కావడంతో ఈ రేంజ్ రీచ్ వచ్చిందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఆమె చివరిసారిగా ట్విట్టర్ లో ‘శాకుంతలం’ మూవీ ప్రొమోషన్స్ సమయంలో కనిపించింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడే దర్శనమిచ్చింది. ఇక నుండి అయినా సమంత ట్విట్టర్ ఖాతాలో యాక్టీవ్ గా ఉంటుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ యాక్టీవ్ గా ఉన్నప్పటికీ కేవలం ప్రొమోషన్స్ కి మాత్రమే ఆమె తన ట్విట్టర్ ఖాతాని పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇకపోతే సమంత చేతిలో ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు లేవు. ఒకప్పుడు ఉన్నంత దూకుడుతో ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. ఒక నటిగా కంటే కూడా, నిర్మాతగా ఆమె స్థిరపడేందుకు ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్'(Tralala Moving Pictures) అనే బ్యానర్ ని స్థాపించి ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాతో పాటు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని నిర్మిస్తుంది కూడా. ఇవి కాకుండా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రామ్ చరణ్(Global Star Ram Charan), సుకుమార్(Director Sukumar) సినిమాలో సమంత హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.
Also Read : టాలీవుడ్ లో అత్యధిక లైక్స్ ని సొంతం చేసుకున్న టాప్ 10 గ్లింప్స్ వీడియోస్ ఇవే..!