Viral Video : తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన ‘విడాముయార్చి’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలైంది. 2023 వ సంవత్సరం తర్వాత అజిత్ నుండి సినిమా వస్తుండడంతో థియేటర్స్ లో అభిమానుల సంబరాలకు హద్దులే లేకుండా పోయాయి. తమిళనాడు మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించారు అజిత్ ఫ్యాన్స్. గత కొంతకాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినప్పటికీ కూడా అజిత్ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గకపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కేవలం తమిళనాడు ప్రాంతం నుండే ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. ఇదంతా పక్కన పెడితే అజిత్ అభిమానులు థియేటర్స్ వద్ద సృష్టించిన వీరంగాన్ని సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో ని చూసి నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే ఒక పాపులర్ తమిళ్ థియేటర్ లో అభిమానులు థియేటర్ బయట బాణాసంచాలు ఇష్టమొచ్చినట్టు కాలుస్తూ, అక్కడికి వచ్చిన జనాలను భయబ్రాంతులకు గురి చేసారు. ఇది చూసిన పోలీస్ సిబ్బంది, అభిమానులను అదుపు చేయడానికి ముందుకు రాగా, అజిత్ అభిమానులు వాళ్ళను సైతం భయపెట్టేసారు. ఈ వీడియో పై నెటిజెన్స్ స్పందిస్తూ పోలీసులు చెప్తున్నది మన మంచి కోసమే, బాణాసంచాలు కాల్చి, పొరపాటు అది కటౌట్ కి తగిలి అగ్నిప్రమాదం జరిగితే అందరూ చనిపోతారు. అందుకే పోలీసులు చెప్పేవి వినాలి, వినకుండా వాళ్ళను బెదిరించడం అనేది మంచి పద్దతి కాదు అంటూ అజిత్ ఫ్యాన్స్ ని మందలిస్తున్నారు నెటిజెన్స్. గతంలో ‘దేవర’ చిత్రానికి సంబంధించి కూడా ఇలాంటి అగ్ని ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో అభిమానులు బాణాసంచా కాలుస్తుండగా, అది కాస్త కటౌట్ కి తగిలి కాలిపోయింది. పెద్దగా మంటలు వ్యాపించడంతో జనాలు బయటకు పరుగులు తీశారు.
థియేటర్ సిబ్బంది వెంటనే ఇది గమనించి మంటల్ని ఆపారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆరోజు పెద్ద అనర్థమే జరిగేది. థియేటర్ కాలిపోవడమే కాకుండా ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, అభిమానులు అత్యుత్సాహాన్ని తగ్గించి పోలీసులకు సహకరించాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక విడాముయార్చి సినిమా విషయానికి వస్తే ఇది రెగ్యులర్ అజిత్ సినిమా కాదు. కేవలం కథని బేస్ చేసుకొని ఎలాంటి డీవియేషన్స్ లేకుండా తెరకెక్కించిన చిత్రం. అందుకే మొదటి ఆట నుండే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా అజిత్ ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అయ్యారు. సినిమా బాగానే ఉంది కానీ, ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ అసలు లేవు. అజిత్ లాంటి సూపర్ స్టార్స్ ఇలాంటి సినిమాలను సాధ్యమైనంత వరకు దూరం పెట్టాలి.
Sambavam pannitanuga#VidaaMuyarchi #VidaaMuyarchiBookings https://t.co/GI1XfPHbM3 pic.twitter.com/yvQucbNe82
— ❤️ (@_Aravind_15) February 5, 2025