https://oktelugu.com/

Viral Pic: లుకింగ్ లైక్ ఏ వావ్.. ఆలియా-రణ్ బీర్ కూతురును చూశారా? వైరల్ పిక్

క్రిస్మస్ సందర్భంగా వేడుకకు వెళ్తున్న ఆలియా భట్, రణబీర్ కపూర్ తమతో పాటు రాహాను కూడా తీసుకెళ్లారు. ఈ సందర్భంగానే రణబీర్ పాపను ఎత్తుకొని బయటకు నడుచుకుంటూ వచ్చారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 26, 2023 / 12:31 PM IST
    Follow us on

    Viral Pic: బాలీవుడ్ స్టార్లు రణబీర్ కపూర్, ఆలియా భట్ ల గారాల పట్టిని చూశారా..? క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అన్న తరహాలో వారి కుమార్తె రాహాను చూస్తే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. మొదటి సారి ఈ జంట పాప ఫేస్ రివీల్ చేశారన్న సంగతి తెలిసిందే.

    క్రిస్మస్ సందర్భంగా వేడుకకు వెళ్తున్న ఆలియా భట్, రణబీర్ కపూర్ తమతో పాటు రాహాను కూడా తీసుకెళ్లారు. ఈ సందర్భంగానే రణబీర్ పాపను ఎత్తుకొని బయటకు నడుచుకుంటూ వచ్చారు. తరువాత కూతురితో కలిసి కెమెరాలకు ఫొజులిచ్చారు. నీలి రంగు కళ్లతో చూడగానే ముద్దుస్తుందంటూ కపూర్ అభిమానులతో పాటు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాహాకు ముత్తాత రాజ్ కపూర్ కళ్లు, తాత రిషి కపూర్, కరీనా కపూర్ పోలికలు వచ్చాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

    అయితే బాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపూల్ గా పేరుగాంచారు ఆలియా – రణబీర్. ప్రేమలో ఉన్న ఆలియా -రణబీర్ గత సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన అంగరంగ వైభవంగా వివాహం జరిగిందన్న సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితులు మరియు సెలబ్రెటీల సమక్షంలో వీరి పెళ్లి ముంబై లో జరిగింది. నవంబర్ 6వ తేదీన వీరికి రాహా జన్మించింది. అయితే అప్పటి నుంచి చిన్నారు పేరు రివీల్ చేసినప్పటికీ మరే సమాచారాన్ని బయటపెట్టలేదు. సోషల్ మీడియా వేదికగా పలుమార్లు ఫొటోస్ షేర్ చేసినప్పటికీ ఎక్కడా చిన్నారి రాహా ఫేస్ మాత్రం కనిపించలేదు.

    రాహా ఫేస్ చూపించాలని అభిమానులు, నెటిజన్లు కోరగా ఆలియా స్పందించారు. రాహాకు రెండేళ్లు వచ్చేంత వరకు ఆమెకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయమని పేర్కొంది. ఒకవేళ ఏదైనా ఈవెంట్ కానీ, ప్రొగ్రామ్స్ లో కనిపించినా ఫొటోగ్రాఫర్లు తమ చిన్నారి ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పెట్టొద్దని తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాహా ఫేస్ ను రివీల్ చేశారు. చిన్నారి క్యూట్ నెస్ కు అభిమానులు, నెటిజన్లు ఫిదా అయిపోయారు.