https://oktelugu.com/

Maanas Marriage : ఘనంగా బిగ్ బాస్, బ్రహ్మముడి ఫేమ్ మానస్ వివాహం.. వైరల్ ఫొటోలు

విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2023 / 07:43 PM IST
    Follow us on

    Maanas Marriage : టాలీవుడ్ హీరో, బుల్లితెర ‘బ్రహ్మముడి’ హీరో, బిగ్ బాస్ ఫేం మానస్ నాగుపల్లి ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. మిత్రులు, బంధువుల సమక్షంలో తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పాడు. బుధవారం రాత్రి చెన్నైకి చెందిన శ్రీజ మెడలో మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకున్నాడు.

    విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

    ఇక చైల్డ్ ఆరిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన మానస్ పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. ఝలక్ హీరోగా అతని మొదటి చిత్రం. కాయ్ రాజా కాయ్, గోలి సోడా, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో మానస్ నటించారు. ఆయనకు సిల్వర్ స్క్రీన్ పై బ్రేక్ రాలేదు. దీంతో సీరియల్ యాక్టర్ గా మారాడు. కార్తీకదీపం సీరియల్ లో కొన్నాళ్ళు నటించాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో లీడింగ్ రోల్ చేస్తున్నాడు.

    బిగ్ బాస్ సీజన్ 5లో మానస్ ఫైనల్ కి వెళ్ళాడు. అయితే టైటిల్ కొట్టలేకపోయాడు. అనూహ్యంగా మానస్ ట్రాన్స్ జెండర్ ప్రియాంకతో సన్నిహితంగా ఉన్నాడు. సన్నీ -షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ కోసం పోటీపడ్డారు. అధిక మొత్తంలో ప్రేక్షకులు సన్నీకి ఒక ఓటు వేసి గెలిపించారు. ఇక మానస్ టైటిల్ గెలవకున్నా ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యాడు. ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. మానస్ ప్రస్తుతం సీరియల్ నటుడిగా కొనసాగుతున్నాడు.

    https://www.youtube.com/watch?v=5GEUdMpd3Po

    ప్రస్తుతం బుల్లితెరపై నంబర్ 1 టాప్ రేటెడ్ సీరియల్ ‘బ్రహ్మముడి’ సీరియల్ లో హీరోగా మానస్ నటిస్తున్నాడు. చెన్నైకి చెందిన శ్రీజను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు.

    ఈ పెళ్లిలో మానస కుటుంబ సభ్యులతోపాటు బుల్లితెర నటులు, బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు సందడి చేశారు. ప్రియ, కాజల్, శుభశ్రీరాయగురు, హమీద, తేజ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ప్రీవెడ్డింగ్, హల్దీ ఫొటోలు వైరల్ అయ్యాయి.