https://oktelugu.com/

Viral Cinema: వైరల్ అవుతున్న టుడే మూవీ డేట్స్

Viral Cinema:  సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. వాలంటైన్స్ రోజునే భర్త రితేశ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించిన రాఖీసావంత్.. అందుకు గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘మీడియా ముందుకొచ్చినప్పుడల్లా నేనే అతడిని ముద్దుపెట్టుకున్నాను. అతను కనీసం నన్ను తాకలేదు. సిగ్గుపడుతున్నాడేమో అనుకున్నా. కానీ అతనికి ఇదివరకే పెళ్లయి, ఓ బాబు ఉన్నాడని తెలిసి నా గుండె పగిలిపోయింది. నన్ను ఒంటిరిగా వదిలేయొద్దని అతడి కాళ్లు పట్టుకున్నా వినిపించుకోలేదు’ అని తెలిపింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 18, 2022 / 10:41 AM IST
    Follow us on

    Viral Cinema:  సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. వాలంటైన్స్ రోజునే భర్త రితేశ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించిన రాఖీసావంత్.. అందుకు గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘మీడియా ముందుకొచ్చినప్పుడల్లా నేనే అతడిని ముద్దుపెట్టుకున్నాను. అతను కనీసం నన్ను తాకలేదు. సిగ్గుపడుతున్నాడేమో అనుకున్నా. కానీ అతనికి ఇదివరకే పెళ్లయి, ఓ బాబు ఉన్నాడని తెలిసి నా గుండె పగిలిపోయింది. నన్ను ఒంటిరిగా వదిలేయొద్దని అతడి కాళ్లు పట్టుకున్నా వినిపించుకోలేదు’ అని తెలిపింది.

    Rakhi Sawant

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పంజాబ్ యాక్టర్ దీప్‌సిద్దూను తలుచుకుని ప్రియురాలు రీనారాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. అతనితో దిగిన ఫొటోలతో సోషల్‌మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టింది. ‘జీవితాంతం నా చేయి పట్టుకుని ఉంటావని మాటిచ్చావు. నాకోసం తిరిగి వచ్చేయ్. సోల్‌మేట్స్ ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. నిన్నుమరో ప్రపంచంలో కలుసుకుంటా’ అని పోస్టు చేసి, కాసేపటికి డిలీట్ చేసింది. ప్రమాదంలో రీనా స్వల్ప గాయాలతో బయటపడింది.

    Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

    deep sidhu

     

     

    అలాగే మరో క్రేజీ అప్ డేట్ ఏమిటంటే.. తమిళ్ స్టార్ హీరో ధనుష్‌ తో విడాకుల ప్రకటన తర్వాత తొలిసారి ఐశ్వర్య రజినీకాంత్ మీడియాతో మాట్లాడింది. జీవితంలో ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరికీ ఆటుపోట్లు ఎదురవుతాయని, వాటిని తప్పకుండా ఎదుర్కోవాలని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. అలాగే ఆమె మాట్లాడుతూ ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ.

    Aishwarya

    అయితే, ప్రేమకు వ్యక్తిగత అంశాలతో సంబంధం లేదని ఐశ్వర్య పేర్కొంది. తాను ఎదిగే కొద్దీ ప్రేమ నిర్వచనం మారుతోందని తెలిపింది. పిల్లలు, అమ్మ, నాన్నలను ప్రేమిస్తానంది. అయితే ఎక్కడా ధనుష్ ప్రస్తావన తీసుకురాలేదు’ అని ఆమె తెలిపింది. మొత్తానికి ఐశ్వర్య విడాకుల విషయంలో అస్సలు తగ్గేదేలే అంటుంది.

    Also Read: కరోనా ముంచింది.. ఏం చేస్తాం చెప్పండి.. విస్తారా సీఈవో లేఖ వైరల్

    Tags