Violence in Cinema : దశాబ్దాలుగా సినిమా కంటెంట్ మారుతూ వస్తుంది. సాధారణంగా సినిమాలు ఆ కాలం నాటి పరిస్థితులను, సామాజిక, సంస్కృతిని ప్రతిబింబించేలా తెరకెక్కుతాయి. తొలినాళ్ళలో పల్లెటూరి నేపథ్యంతో కూడిన కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కేవి. చెప్పాలంటే ఈ సినిమాల్లో కథే హీరో. అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉండేది. ప్రత్యేకంగా హీరో అంటూ ఉండేవారు కాదు. మిస్సమ్మ వంటి క్లాసిక్ తీసుకున్నా.. ఎన్టీఆర్, సావిత్రి హీరో హీరోయిన్ అని చెప్పలేం. జమున, ఎస్వీఆర్, ఏఎన్నార్, రమణారెడ్డి, రేలంగి పాత్రలు కూడా ప్రధానంగా సాగుతాయి.
Also Read :అఖండ 2 లో వేవ్ స్టెప్ వేస్తున్న బాలయ్య…డ్యాన్స్ తో యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నాడా..?
ఆ రోజుల్లో సినిమాల్లో పెద్దగా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేవి కావు. ఉన్నప్పటికి రక్తపాతంతో కూడుకుని ఉండేవి కాదు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఇండియన్ సినిమా కమర్షియల్ హంగులు దిద్దుకోవడం ఆరంభించింది. స్టంట్స్, ఛేజింగ్ సీన్స్, గన్ ఫైట్స్ స్టార్ హీరోల చిత్రాల్లో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. గత పదేళ్లుగా ఇండియన్ ఆడియన్స్ టేస్ట్ మారింది. మెజారిటీ ఆడియన్స్ వైలెన్స్ తో కూడిన యాక్షన్ చిత్రాలను ఇష్టపడుతున్న భావన కలుగుతుంది.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ దక్కుతున్నప్పటికీ రక్తపాతంతో కూడిన కమర్షియల్ సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నాయి. కెజిఎఫ్, కెజిఎఫ్ 2, సలార్, యానిమల్, మార్కో.. తాజాగా హిట్ 3 ఇందుకు కొన్ని ఉదాహరణలు. మలయాళ చిత్రం మార్కో వైలెన్స్ లో పీక్స్ అని చెప్పాలి. పిల్లలను కూడా అతి క్రూరంగా విలన్ చంపడం ఈ మూవీలో చూపించారు. ఈ సినిమాను ఓటీటీలో బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపించింది.
యానిమల్ సైతం మోస్ట్ వైలెన్స్ తో కూడిన చిత్రం. విలన్ పీక కోసిన హీరో ఒంటినిండా రక్తంతో సెలెబ్రేట్ చేసుకుంటూ, ఇంటికి వస్తాడు. ఈ సీన్ మీద అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇక హిట్ 3లో విపరీతమైన వైలెన్స్ చూపించారు. అసలు ట్యాంకర్స్ కొద్దీ ఎరుపు రంగు వాడేశారేమో అన్నంతగా సినిమాల్లో వైలెన్స్ ఉంటుంది. హిట్ 3 మూవీ రెండు రోజుల్లో రూ. 65 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. హిట్ 3 తో పాటు పైన పేర్కొన్న చిత్రాల్లన్నీ భారీ విజయాలు అందుకున్నవే.
ఉన్ని ముకుందన్, రన్బీర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా మార్కో, యానిమల్ నిలిచాయి. శ్రీకాంత్ ఓదెల తో చిరంజీవి ప్రకటించిన మూవీ సైతం ఇదే తరహాలో సాగనుందని సమాచారం. ప్రకటన పోస్టర్ తో హింట్ ఇచ్చేశారు. అదే దర్శకుడు నాని తో చేస్తున్న ది పారడైజ్ సైతం మోస్ట్ వైలెంట్ మూవీ. ఎంత రక్తం పారిస్తే అంత గొప్ప వసూళ్లు అన్నట్లు ట్రెండ్ ఉంది. మేకర్స్ అదే ఫాలో అవుతున్నారు.