Vimanam Collections: ఈ ఏడాది సమ్మర్ సీజన్ లో ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేకపోవడం తో చిన్న సినిమాలు పండుగ చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సమ్మర్ లో విడుదలైన సినిమాలలో భారీ కమర్షియల్ హంగులతో, భారీ తారాగణం తో వచ్చిన సినిమాలు బోల్తా కొట్టగా, ఉలుకూ పలుకులు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు మాత్రం సక్సెస్ సాధించాయి. రీసెంట్ గా విడుదలైన ప్రముఖ నటుడు/దర్శకుడు సముద్ర ఖని ‘ విమానం’ చిత్రానికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది.
పోస్టర్స్, టీజర్స్ మరియు ట్రైలర్స్ దగ్గర నుండే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షింది. సముద్ర ఖని లాంటి నటుడు ఉండడం తో కొంతమంది టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ద్వారా బాగా ప్రమోట్ చేసారు. ఇంతమంది ప్రమోట్ చేసారంటే ఈ సినిమాలో కచ్చితంగా కంటెంట్ బలంగానే ఉంటుందని నమ్మరు ఆడియన్స్, అందుకే ఈ సినిమాని బ్రేక్ ఈవెన్ అంచుల్లోకి తీసుకెళ్లారు.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 40 లక్షల షేర్, రెండవ రోజు 35 లక్షల షేర్, మూడవ రోజు 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిందట. విడుదలకు ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కోటి 50 లక్షల రూపాయలకు జరిగిందట, మూడు రోజుల్లో దాదాపుగా కోటి 7 లక్షల రూపాయిల షేర్ ని సాధించిన ఈ సినిమా, బ్రేక్ ఈవెన్ కి మరో 43 లక్షల రూపాయిల దూరం లో ఉంది. ఇంత సులువుగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
సముద్ర ఖని కి ఈమధ్య అన్నీ బాగా కలిసి వస్తున్నాయని, నటుడిగా ఇప్పటికే ఆయన సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడని, అలాగే డైరెక్టర్ గా ఏకంగా పవన్ కళ్యాణ్ తో చేసే ఛాన్స్ దక్కిందని, ఇప్పుడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాధించిందని, ఇలా ఎలా చూసుకున్న సముద్ర ఖని కి ప్రస్తుతం మహర్దశ నడుస్తుందని అంటున్నారు నెటిజెన్స్.