https://oktelugu.com/

Villain Rami Reddy : సీనియర్ విలన్ రామిరెడ్డి గుర్తున్నాడా..? ఈయన కుటుంబం ఇప్పుడు ఎలా ఉందో చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

రాజశేఖర్ హీరో గా, అప్పట్లో 'అంకుశం' అనే చిత్రం తెరకెక్కి, బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోన్ రామిరెడ్డి విలన్ గా వెండితెర అరంగేట్రం చేసాడు. తొలిసినిమాలోనే బలమైన పాత్ర దొరకడంతో రామిరెడ్డి హీరో ని సైతం డామినేట్ చేసే రేంజ్ లో నటించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 / 09:03 PM IST

    Villain Rami Reddy Family

    Follow us on

    Villain Rami Reddy : తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం, మన తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన మహానటులలో ఒకరు రామి రెడ్డి. విలన్ అంటే ఇలాగే, అసలు సిసలు విలనిజం అంటే ఇదే అని ఒక తరం ఆడియన్స్ మొత్తాన్ని భయపెట్టిన మహానటుడు ఈయన. తెలంగాణ యాసలో అద్భుతంగా డైలాగ్స్ ని పలుకుతూ, తన మ్యానరిజమ్స్ తో విలనిజం లో సరికొత్త కోణాలు చూపించిన మహానటుడు ఆయన. కోడి రామకృష్ణ దర్శకత్వం లో , యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరో గా, అప్పట్లో ‘అంకుశం’ అనే చిత్రం తెరకెక్కి, బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోన్ రామిరెడ్డి విలన్ గా వెండితెర అరంగేట్రం చేసాడు. తొలిసినిమాలోనే బలమైన పాత్ర దొరకడంతో రామిరెడ్డి హీరో ని సైతం డామినేట్ చేసే రేంజ్ లో నటించాడు.

    ఫలితంగా ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు, టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ క్యూలు కట్టాయి. ఇదే అంకుశం చిత్రాన్ని హిందీ లో మెగాస్టార్ చిరంజీవి ని హీరో గా పెట్టి ‘ప్రతిబంద్’ అనే చిత్రాన్ని చేసారు. ఈ సినిమాలో కూడా మెయిన్ విలన్ గా రామిరెడ్డి నే నటించాడు. తెలుగుతో పాటు, హిందీ లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. రామిరెడ్డి పేరు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా, ఈ చిత్రంతో బాలీవుడ్ లో కూడా మోత మోగిపోయింది. ఈ సినిమా విడుదలైన ఏడాదిలోనే రామిరెడ్డి కి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో విలన్ గా నటించే అవకాశం దక్కింది. అలా ఇండస్ట్రీ లో ఆయనకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు ,హిందీ, కన్నడం, తమిళం, మలయాళం ఇలా ఒక్కటా రెండా అన్ని భాషల్లోనూ విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టు గా నటించి సంచలనం సృష్టించాడు.

    ‘అంకుశం’ చిత్రం తర్వాత ఆయనకి ఆ రేంజ్ గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం ‘అమ్మోరు’. ఈ సినిమాకి కూడా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించడం గమనార్హం. అలా ఆయన తన కెరీర్ లో రెండు సార్లు పీక్ ని కోడి రామకృష్ణ వల్లే చూసాడు. అందుకే ఆయన అనేక ఇంటర్వ్యూస్ లో కోడి రామకృష్ణ నాకు గురువు, ఆయనే నాకు జీవితాన్ని ఇచ్చాడు అని గర్వంగా చెప్పుకునేవాడు. అలా 2010 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన రామి రెడ్డి, 2011 వ సంవత్సరం లో అనారోగ్యం కారణంగా కన్ను మూసాడు. ఈయనకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. అందరికీ పెళ్లిళ్లు చేసేసాడు. కొడుకులు ఈయన లాగానే ఇండస్ట్రీ లోకి వచ్చి పెద్ద నటులు అవుతారని రామిరెడ్డి ని అభిమానించే వాళ్ళు ఆశిస్తే, వాళ్ళు మాత్రం ఇండస్ట్రీ కి దూరంగా పెరిగారు. ప్రస్తుతం వీళ్లిద్దరు హైదరాబాద్ లో పలు స్వీట్ షాప్స్ ని నడుపుతున్నట్టు తెలుస్తుంది. వ్యాపారం మంచి స్థాయిలోనే కొనసాగుతుంది. అయితే రామిరెడ్డి లాంటి మహానటుడు లేజసీ ని ఆయన కొడుకు సినీ రంగం లో కొనసాగించి ఉండుంటే బాగుండేది, ఇలా సామాన్యమైన జీవితాన్ని గడపాల్సిన ఖర్మ వాళ్లకు ఏమిటి అని రామిరెడ్డి ని ఇష్టపడే వాళ్ళు బాధపడుతున్నారు.