https://oktelugu.com/

Mechanic Rocky Movie Collections : విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ కి డిజాస్టర్ ఓపెనింగ్స్..మొదటి రోజు వసూళ్లు ఇంతేనా? ‘పుష్ప 2’ ప్రభావం మామూలుగా లేదుగా!

నేడు విడుదలైన లేటెస్ట్ చిత్రం 'మెకానిక్ రాకీ' కి పాజిటివ్ రివ్యూస్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఓపెనింగ్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో లేవు. ఆయన గత చిత్రం 'గామీ' కి వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

Written By: , Updated On : November 22, 2024 / 09:12 PM IST
Mechanic Rocky Movie Collections

Mechanic Rocky Movie Collections

Follow us on

Mechanic Rocky Movie Collections : విభిన్నమైన కథాంశాలతో యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్న హీరోలలో ఒకరు విశ్వక్ సేన్. తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సూపర్ హిట్ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన ఈయన ‘ఫలక్ నూమా దాస్’, ‘హిట్ : ది ఫస్ట్ కేస్’, ‘ఆకాశవానంలో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధమ్కీ’, ‘గామీ’ వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా,నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఈయన గొప్పగా రాణించాడు. ఈయన నుండి నేడు విడుదలైన లేటెస్ట్ చిత్రం ‘మెకానిక్ రాకీ’ కి పాజిటివ్ రివ్యూస్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఓపెనింగ్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో లేవు. ఆయన గత చిత్రం ‘గామీ’ కి వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

కానీ ‘మెకానిక్ రాకీ’ చిత్రానికి మాత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల రూపాయిల షేర్, వరల్డ్ వైడ్ గా 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందట. విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఓపెనింగ్స్ ని సాధించిన సినిమాగా ‘మెకానిక్ రాకీ’ చిత్రం నిల్చింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. విశ్వక్ సేన్ తన ప్రతీ సినిమాని విడుదలకు ముందు సరికొత్త పద్దతిలో ప్రొమోషన్స్ చేసి, జనాల్లోకి తన సినిమాని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అది ఈ సినిమా విషయం లో మిస్ అయ్యింది. అసలు ఈ చిత్రం విడుదల అవుతుంది అనే విషయం నిన్న విశ్వక్ సేన్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే కానీ తెలియలేదు. ఆ రేంజ్ లో ఉన్నాయి అన్నమాట ప్రొమోషన్స్.

అంతే కాకుండా విశ్వక్ సేన్ సినిమా అంటే కచ్చితంగా కొత్తదనం తో కూడుకున్న కథ, స్క్రీన్ ప్లే ని ఆశిస్తారు ప్రేక్షకులు. ఆ రెండు కూడా ఈ సినిమాలో లేనట్టు టీజర్, ట్రైలర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. చాలా రొటీన్ సినిమాగా విడుదలకు ముందే ఆడియన్స్ కి అనిపించింది. అందుకే ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. ఇవన్నీ కొన్ని కారణాలు అయితే, ఈ సినిమాని జనాలు పట్టించుకోకపోవడాన్ని మరో ప్రధాన కారణం ‘పుష్ప 2’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ఈ సినిమా వచ్చే నెల 5 వ తారీఖున విడుదల కాబోతుంది. ఒక్క పెద్ద సినిమా విడుదలకు ముందు ఇలాంటి చిన్న సినిమాలకు డబ్బులు ఖర్చు చేయడానికి ఆడియన్స్ అసలు ఆసక్తి చూపించరు. అందుకే ‘మెకానిక్ రాకీ’ కి ఈ స్థాయి డిజాస్టర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. గామీ చిత్రానికి మొదటిరోజు 5 కోట్ల రూపాయిల షేర్ వస్తే, ‘మెకానిక్ రాకీ’ కి ఫుల్ రన్ లో కూడా అంత వసూళ్లు రావని అంటున్నారు ట్రేడ్ పండితులు.