https://oktelugu.com/

Vikram: లెజెండరీ డైరెక్టర్ తో కల్ట్ క్లాసిక్ మిస్… రెండు నెలలు ఏడ్చిన విక్రమ్, ఏంటా చిత్రం?

హీరో విక్రమ్ ఓ చిత్రాన్ని కోల్పోయినందుకు రెండు నెలలు నిరవధికంగా ఏడ్చాడట. అందుకే కారణం ఏమిటో? ఆ చిత్రం ఏమిటో? విక్రమ్ వెల్లడించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : September 2, 2024 / 10:30 AM IST

    Vikram(1)

    Follow us on

    Vikram: ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న నటుల్లో విక్రమ్ ఒకరు. ముఖ్యంగా తమిళ, తెలుగు భాషల్లో ఆయనకు భారీ మార్కెట్ ఉంది. శివ పుత్రుడు, అపరిచితుడు, ఐ చిత్రాలతో ఆయన ఫేమ్ రాబట్టారు. అపరిచితుడు తెలుగులో సైతం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాత్ర కోసం శరీరాన్ని మార్చుకునే అతికొద్ది మంది నటుల్లో విక్రమ్ కూడా ఉన్నారు. ఐ చిత్రం కోసం ఆయన విపరీతంగా బరువు తగ్గారు. లైఫ్ ని సైతం రిస్క్ లో పెట్టాడు.

    విక్రమ్ తన లేటెస్ట్ మూవీ తంగలాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన తంగలాన్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పీరియాడిక్ అడ్వెంచర్ డ్రామాగా తంగలాన్ తెరకెక్కించారు. ఈ మూవీలో విక్రమ్ లుక్ హైలెట్ అని చెప్పాలి. అసలు విక్రమ్ రూపమే మారిపోయింది. గుర్తు పట్టడం కూడా కష్టమే అన్నట్లు మేకోవర్ అయ్యారు.

    తంగలాన్ సక్సెస్ నేపథ్యంలో విక్రమ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తనపై ప్రచారంలో ఉన్న ఓ పుకారుకు ఆయన క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి మూవీని విక్రమ్ రిజెక్ట్ చేశాడనే వాదన ఉంది. అది నిజం కాదని, ఆ మూవీ కోల్పోయినందుకు రెండు నెలలు ఏడ్చానని విక్రమ్ వెల్లడించాడు.

    విక్రమ్ మాట్లాడుతూ… బొంబాయి మూవీ ఆడిషన్స్ లో నేను పాల్గొన్నాను. చివరి దశ ఆడిషన్ లో నేను ఫెయిల్ అయ్యాను. మణిరత్నం నన్ను ఆడిషన్ ఇవ్వమన్నారు. హీరోయిన్ వెళుతుంది. ఆమెను మీరు పిలిచి ఆపాలి. నటించండి అని నాకు మణిరత్నం చెప్పారు. నా ముందు స్టిల్ కెమెరా ఉంది. స్టిల్ కెమెరాతో ఆయన వీడియో ఎలా తెస్తారనే సందిగ్ధంలో నేను ఉండిపోయాను.

    దాదాపు బొంబాయి చిత్రానికి నేను హీరోగా ఫైనల్ అయ్యాను. నా సిల్లీ బిహేవియర్ తో అవకాశం చేజార్చుకున్నాను. మణిరత్నం తో పని చేయాలి అనేది నా కల. ఆయనతో ఒక మూవీ చేసి రిటైర్ అయిపోవాలని అనుకునేవాడిని. ఉదయం ఆ మూవీ హీరోయిన్ మనీషా కొయిరాల మీద ఫోటో షూట్ జరిగింది. సాయంత్రం నేను ఫోటో షూట్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ నేను ఆఫర్ కోల్పోయాను. బొంబాయి మూవీ చేజారినందుకు నేను రెండు నెలలు ఏడుస్తూనే ఉన్నాను… అని అన్నారు.

    బొంబాయి పాన్ ఇండియా హిట్. విక్రమ్ ని కాదని అరవింద స్వామికి మణిరత్నం ఛాన్స్ ఇచ్చాడు. బొంబాయి మణిరత్నం నుండి వచ్చిన కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. అరవింద స్వామి-మనీషా కొయిరాలా కెమిస్ట్రీ అద్భుతం. ఇక ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. విక్రమ్ స్టార్ గా ఎదిగాక మణిరత్నంతో రావణ్ మూవీ చేశాడు. అలాగే పొన్నియిన్ సెల్వం సిరీస్లో నటించారు.