Jana Nayagan Censor Row: తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) నటించిన ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్రానికి సెన్సార్ బోర్డు ఇప్పట్లో మోక్షం కలిగించేలా లేదు. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు UA సర్టిఫికెట్ ని జారీ చేసి మళ్లీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఫారిన్ దేశాలు మన ఇండియాలో మాత విద్వేషాలను రెచ్చగొడుతాయని. అలాంటి సన్నివేశాలు ఉన్న ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తే భారీ ఎత్తున అల్లర్లు జరిగే అవకాశం ఉందని, అందుకే ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించామని సెన్సార్ బోర్డు వివరణ ఇచ్చింది. ఈ అంశం పై నిర్మాతలు హై కోర్టు కి వెళ్లారు. న్యాయం తొందరగానే జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.
తాజాగా మూవీ టీం కి హైకోర్టు నుండి మరో కోలుకోలేని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ జారీ చెయ్యాలంటూ సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కానీ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుని మద్రాస్ హై కోర్టు చీఫ్ బెంచ్ రద్దు చేసింది. దీంతో నిర్మాతలకు ఏమి చెయ్యాలో తోచని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే త్వరలోనే తమిళనాడు వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయాల్లో తీర్పు ఇవ్వడం అసాధ్యం కావడం తో మే నెల వరకు ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు అసలు కనిపించడం లేదు. అంటే విజయ్ ఫ్యాన్స్ మరో నాలుగు నెలలు ఆగాల్సిందే అన్నమాట. అప్పటికైనా వస్తుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇలా ఒక సినిమా పై సెన్సార్ బోర్డు నుండి ఈ రేంజ్ టార్గెట్ జరగలేదు.
మరోపక్క స్టాలిన్ ప్రభుత్వమే కావాలని ఇలా విజయ్ సినిమాని తొక్కుతుంది అనే భావన జనాల్లో చాలా బలంగా కలుగుతోంది. ఆ కారణం చేత విజయ్ పై సానుభూతి పెరగడం మొదలైంది. కరూర్ లో తొక్కిసలాట ఘటన, అదే విధంగా ఆయన సినిమాకు ఇలా స్టాలిన్ ప్రభుత్వం, అదే విధంగా కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం తమ పవర్ ని ఉపయోగించి TVK పార్టీ అధినేత విజయ్ ని దారుణంగా రాజకీయ టార్గెట్ చేస్తున్నారని, ఇది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయ్ కి బాగా కలిసొచ్చే అంశాలుగా నిలుస్తాయని అంటున్నారు.