https://oktelugu.com/

మరోసారి మెగాఫోన్ పట్టనున్న విజేంద్రప్రసాద్

దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాల్లో అపజయం లేకుండా దూసుకుపోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీని తన సినిమాలతో ప్రపంచస్థాయికి రాజమౌళి తీసుకెళ్లాడు. టాలీవుడ్లో నిర్మించిన ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ సినిమాలు ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాశాయి. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఈ సినిమా రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అల్లూరి సీతరామరాజుగా రాంచరణ్, కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న […]

Written By: , Updated On : May 27, 2020 / 07:41 PM IST
Follow us on


దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాల్లో అపజయం లేకుండా దూసుకుపోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీని తన సినిమాలతో ప్రపంచస్థాయికి రాజమౌళి తీసుకెళ్లాడు. టాలీవుడ్లో నిర్మించిన ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ సినిమాలు ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాశాయి. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఈ సినిమా రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అల్లూరి సీతరామరాజుగా రాంచరణ్, కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెల్సిందే. రాజమౌళి వరుస విజయాల వెనుక అతడి తండ్రి విజయేంద్రప్రసాద్ ఉన్నారు. రాజమౌళి తెరకెక్కించే సినిమాలన్నింటికీ విజేంద్రప్రసాద్ కథా రచయితగా ఉన్నారు.

విజయేంద్రప్రసాద్ కథా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. రాజమౌళి తెరకెక్కించే మూవీలతోపాటు పలు సినిమాలకు కథలను అందించారు. ‘మెర్సల్’, ‘భజరంగీ భాయ్ జాన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలకు కథలను అందించారు. కాగా దర్శకుడిగా మాత్రం విజయేంద్రప్రసాద్ అనుకున్నంత సక్సస్ సాధించలేకపోయారు. ఆయన దర్శకత్వం వహించిన ‘అర్థాంగి’, ‘శ్రీకృష్ణ-2006’, ‘రాజన్న’, ‘శ్రీవల్లీ’ వంటి సినిమాలు విజేంద్రప్రసాద్ కు అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో విజేంద్రప్రసాద్ తిరిగి కథా రచనలపై ఫోకస్ పెట్టారు. ఆయన రాసే కథలకు ఫుల్ డిమాండ్ ఉంది. అయితే తాజాగా ఓ యంగ్ హీరోతో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధపడుతున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. సదరు యంగ్ హీరో కోసం ఓ పవర్ ఫుల్ కథను కూడా రాస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆ హీరో ఎవరో మాత్రం బయటకు రావడం లేదు. ఈసారైనా విజేంద్రప్రసాద్ దర్శకుడిగా విజయం సాధిస్తారా? లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే..!