Homeఎంటర్టైన్మెంట్Vijayendra Prasad: రాజమౌళి నెక్స్ట్ మూవీ మీద క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్...

Vijayendra Prasad: రాజమౌళి నెక్స్ట్ మూవీ మీద క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్…

Vijayendra Prasad: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా తో తన కెరీర్ ని మొదలు పెట్టిన రాజమౌళి ప్రస్తుతం 12 సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించాడు. ఇప్పుడు వారణాసి సినిమాతో 13 వ సక్సెస్ ను కూడా సాధించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన తన తదుపరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది. ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంలో కూడా చాలా క్లారిటి రావాల్సిన అవసరమైతే ఉంది. ఈ విషయం మీద రీసెంట్ గా రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ ఒక క్లారిటి ఇచ్చాడు. నిజానికి రాజమౌళి చేసే సినిమాలన్నింటికి కథలను తనే అందిస్తాడు. కాబట్టి తనతో ఇప్పటికే ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా కథనైతే రెడీ చేయమని చెప్పారట. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సీనియర్ హీరోలైనా చిరంజీవి,నాగార్జున,బాలకృష్ణ, వెంకటేష్ లతో పాటు రజినీకాంత్ ను కూడా ఈ సినిమాలో భాగం చేయబోతున్నారట. నిజానికి వీళ్ళందరు కలిసి ఒక సినిమా చేయడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందనే చెప్పాలి.

నిజంగానే వీళ్ళందరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయంలో కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. విజయేంద్రప్రసాద్ అయితే వీళ్ళందరిని కలిపి ఒక కథను రెడీ చేస్తున్నాడట. ఇక సీనియర్ హీరోలందరిని కలపాలని ఎప్పటినుంచో రాజమౌళికి ఉంది.

కాబట్టి వీళ్ళందరిని కలిపి చూపిస్తే ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలాంటి ఒక సినిమాకి కథనైతే రాయమని చెప్పారట. విజయప్రసాద్ దానికి న్యాయం చేస్తున్నాడు కథలో అందరికీ ప్రాముఖ్యత ఉండే విధంగా చూసుకుంటూ ఒక మంచి కథనైతే తను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇంతకుముందు ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ని కలిపిన రాజమౌళి ఇప్పుడు సీనియర్ హీరోలందరిని కలిపి సినిమా చేయించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… రాజమౌళి కనక ఈ హీరోలందరినీ కలిపి సినిమా చేసినట్లయితే మాత్రం ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular