Vijayashanti: లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబచ్చన్ గా పిలిచే విజయశాంతి గురించి అందరికి తెలిసిందే. ఆమె పాతతరం అగ్రహీరోలందరితో జతకట్టింది. విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తన ఇమేజ్ పెంచుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునతో జతకట్టి తనకు ఎదురే లేదని నిరూపించుకుంది. వారితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించింది. చిరంజీవితోనైతే ఎక్కువ సినిమాలు చేసింది. అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే కావడం గమనార్హం. తొంబైయవ దశకంలో వారిదే హవా. ఏ సినిమా తీసినా హిట్టే. అంతటి ప్రాధాన్యం ఉన్న జంటగా చిరంజీవి, విజయశాంతి నిలిచారు. తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. గ్యాంగ్ లీడర్ లో ఇద్దరు పోటీపడి నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.

సినిమాలకు గుడ్ బై చెప్పాక రాములమ్మ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ లో చేరి ఉద్యమం చేసినా అందులో ఎక్కువ కాలం ఉండలేదు. తరువాత కాంగ్రెస్, ఆ తరువాత బీజేపీలో చేరారు. ప్రజాసేవ చేయడమే తన ఉద్దేశమని చెబుతోంది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. దాని కోసం భారీ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై కూడా తనకు సినిమాలంటే ఇష్టం లేదని చెబుతోంది. రాజకీయాల్లో ప్రజాసేవ చేయడమే బాగుంటుందని తన మనసులోని మాట వెల్లడిస్తోంది.
ఇక పాతతరం హీరోల గురించి చెప్పమని ఓ విలేకరి ప్రశ్నించగా అందరూ దొంగలే అని అందరిలో సంచలనం కలిగించింది. పాతతరం హీరోలు సంపాదిస్తున్న దాంట్లో కనీసం ఇరవై శాతమైనా ప్రజల కోసం ఖర్చు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో కలిసి అందరు నటించారు. కానీఇప్పుడు కనీసం ప్రజాసేవలో ఉన్న తనకు ఒక దండ కూడా వేయడానికి వారికి సమయం లేదా అని ప్రశ్నించింది. అందుకే అందరిని దొంగలతో పోల్చినట్లు తెలుస్తోంది. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు ఎలా ఖర్చు చేశామన్నదే ప్రధానం. అంతేకాని ఏదో వస్తుందని కోటాను కోట్లు ఇనుప పెట్టెలో పెట్టుకుంటే ఏం లాభమని ప్రశ్నిస్తోంది.

తాను తలుచుకుంటే కేంద్రమంత్రిని అయ్యేదానినే కానీ ప్రజాసేవ చేయడానికి పదవులు అవసరం లేదనే ఉద్దేశంతోనే కార్యకర్తగా మిగిలిపోతున్నాను. రాజకీయాల్లో పదవులు సాధించడం పెద్ద విషయమేమీ కాదు. నలుగురి క్షేమం కోసం పనిచేయడంలోనే ఆత్మసంతృప్తి ఉంటుందని గుర్తించి ప్రజా సేవ కోసం ఇలా చేస్తున్నానని చెప్పింది సినిమాల విషయంలో తనకు బాగా నచ్చిన పాత్ర అయితేనే చేస్తానని చెబుతోంది. ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేసి చులకన కావడం ఇష్టం లేదని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది.