Vijayashanthi : సౌత్ ఇండియా లో దాదాపుగా అందరి హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి, ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని, నేషనల్ అవార్డు ని తన ఖాతాలో వేసుకొని, లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ కి సృష్టికర్త గా నిల్చిన హీరోయిన్ విజయ శాంతి. ఈమె సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లినందుకు ఎంత మంది సినీ అభిమానులు బాదపడ్డారో మాటల్లో చెప్పలేము. అయితే ఈమెని పట్టుబట్టి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి తీసుకొచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్ అవ్వడంతో విజయశాంతి(Vijayashanthi) ఇక రాబోయే రోజుల్లో కూడా సినిమాలను కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ నేను ఇక మీదట సినిమాలు చేయను అంటూ ఒక ట్విట్టర్ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.
Also Read : వీర ధీర శూర’ క్లోజింగ్ కలెక్షన్స్..విక్రమ్ ని చావుదెబ్బ కొట్టిన అజిత్!
కానీ చాలా కాలం తర్వాత తన మార్క్ హీరోయిజం ఉండే క్యారక్టర్ దొరకడంతో ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ చిత్రం చేసింది. రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా విజయశాంతి మూవీ ప్రొమోషన్స్ లో భాగాంగా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ విజయశాంతి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు మీ కెరీర్ లో అత్యధిక సినిమాలు చిరంజీవి(Megastar Chiranjeevi), బాలకృష్ణ(Nandamuri Balakrishna) తోనే చేశారు. రాబోయే రోజుల్లో మళ్ళీ వాళ్ళతో కలిసి నటిస్తారా?’ అని అడగ్గా, దానికి విజయశాంతి సమాధానం చెప్తూ ‘అలాంటి అవకాశమే లేదు. రీసెంట్ గానే ఎమ్మెల్సీ పదవిని చేపట్టాను. కాబట్టి ప్రజా జీవితంలో బాధ్యతలు పెరిగాయి. ఇంతకు ముందు లాగా ఇప్పుడు సినిమాలు చేసే ఆలోచన లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. గతంలో కూడా ఇలాగే చెప్పి సినిమాలు చేసింది కదా, భవిష్యత్తులో కూడా కుదిరితే మళ్ళీ వీళ్ళతో ఈమె కలిసి సినిమా చేయొచ్చు అని అంటున్నారు అభిమానులు.
మెగాస్టార్ చిరంజీవి తో విజయశాంతి దాదాపుగా పాతిక సినిమాలు చేసింది. అదే విధంగా బాలయ్య తో కలిసి 23 సినిమాలు చేసింది. చిరంజీవి తో ఈమె కలిసి చేసిన గ్యాంగ్ లీడర్, యముడికి మొగుడు, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, ఇలా ఒక్కటా రెండా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చాయి. అదే విధంగా ఈమె బాలయ్య తో చేసిన ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్పెక్టర్, భార్గవ రాముడు, మువ్వా గోపాలుడు, లారీ డ్రైవర్ వంటి చిత్రాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.ఇలా ఆమె చేసిన 200 చిత్రాల్లో 50 చిత్రాలు ఈ ఇద్దరి హీరోలతోనే చేసింది. అదే విధంగా వెంకటేష్ తో నాలుగు సినిమాలు, అక్కినేని నాగార్జున తో మూడు సినిమాలు చేసింది విజయశాంతి.