Homeఎంటర్టైన్మెంట్Vijaya Shanti : ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రామలక్ష్మణులు లాగ కనిపిస్తున్నారు : విజయ శాంతి

Vijaya Shanti : ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రామలక్ష్మణులు లాగ కనిపిస్తున్నారు : విజయ శాంతి

Vijaya Shanti :  ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత విజయశాంతి(Vijayashanti) నటించిన మరో చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'(Arjun S/O Vyjayanthi). కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 18వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, మా అన్నయ్య కాలర్ ఎగరేసుకునే సినిమా తీశాడని, చివరి 15 నిమిషాలకు ఆడియన్స్ కన్నీళ్లు ఆపుకోలేరు అంటూ చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ స్పీచ్ కి ముందు విజయశాంతి ఇచ్చిన స్పీచ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Also Read : ఈ 25 సంవత్సరాల్లో మన స్టార్ హీరోలు సాధించిన ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇవే…

ఆమె మాట్లాడుతూ ‘ సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత నేను సినిమాలు చేయకూడదని అనుకున్నాను. కానీ నా అభిమానులు మాత్రం రాములక్కా మా కోసం ఒక మంచి సినిమా చేయండి అని ఎక్కడికి వెళ్లినా అడుగుతూనే ఉన్నారు. ‘సరిలేదు నీకెవ్వరూ’ చిత్రం చేశారు కానీ, అది మాకు సరిపోలేదు అని అన్నారు. అంత పెద్ద హిట్ అయిన సినిమాలోనే నా పాత్ర అందరికీ సంతృప్తి ని ఇవ్వలేదు, మరి అందరికీ నచ్చే పాత్ర ఎలా వస్తుంది అని అనుకుంటూ ఉన్నాను. అలాంటి సమయంలో ప్రదీప్ నా దగ్గరకు వచ్చి ఈ సినిమా స్టోరీ ని వినిపించాడు. నాకు చాలా నచ్చింది. నా పాత్ర విషయం లో కొన్ని సూచనలు చేసాను. పూర్తి కథ సిద్దమైన తర్వాత, షూటింగ్ చేసున్నప్పుడు కచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం వచ్చింది. ఈమధ్యనే ఎడిటర్ తమ్మిరాజు గారు నాతో ‘ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని చెప్పారు, నాకు చాలా ఆనందం వేసింది’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘మహానటుడు సీనియర్ ఎన్టీఆర్ అంటే మాకు ఎంతో గౌరవం. ఆ మహానుభావుడి నుండి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తాతగారి లాగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా అద్భుతంగా నటిస్తారు. సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడతారు. అందుకు ప్రేక్షకులు ఇచ్చే ఉత్సాహం ఎక్కడలేని బలాన్ని ఇస్తుంది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లను ఇలా చూస్తుంటే రామలక్ష్మణులు లాగా కనిపిస్తున్నారు. వాళ్లిద్దరూ ఎప్పుడూ ఇలా సంతోషం గా నవ్వుతూ ఉండాలి. ప్రేక్షకులు మీ ఇద్దరినీ గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తున్నారు. మీరు మరికొన్ని గొప్ప సినిమాలు చేయాలి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు నాకు ఎంతో సపోర్టుగా నిలిచారు. అందుకే ఈ పాత్ర బాగా చేయగలిగాను, అందుకు వారికి ఈ సందర్భంగా నేను కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది విజయశాంతి.

Also Read : కళ్యాణ్ రామ్ పై విజయశాంతి కీలక కామెంట్స్… వాళ్ళను ఎక్కడ నుండి పట్టుకొస్తాడో తెలియదు అంటూ!

Vijayashanthi Speech At Arjun S/o Vyjayanthi Pre Release Event | Kalyan Ram | April 18th

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version