Vijayashanti
Vijayashanti: రాజకీయాల్లోకి వచ్చాక నటనకు గుడ్ బై చెప్పింది విజయశాంతి. నటిగా ఆమె లెగసీ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోలకు సమానమైన స్టార్డం అనుభవించింది. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా ఆమె ఉన్నారు. కర్తవ్యం మూవీలో పోలీస్ ఆఫీసర్ గా ఆమె నటన అద్భుతం. ఈ చిత్రానికి విజయశాంతి నేషనల్ అవార్డు అందుకుంది. కమర్షియల్ గా కూడా కర్తవ్యం భారీ విజయం సాధించింది. 1990లో విడుదలైన కర్తవ్యం రూ. 7 కోట్ల వసూళ్లు అందుకుంది. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కోట్ల వసూళ్లు అంటే, మరో హీరోయిన్ నెలకొల్పలేని రికార్డు అది.
Also Read: ఈ 25 సంవత్సరాల్లో మన స్టార్ హీరోలు సాధించిన ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇవే…
కర్తవ్యం అనంతరం విజయశాంతి అనేక చిత్రాల్లో పోలీస్ రోల్ చేసింది. ప్రస్తుతం విజయశాంతి ఆచితూచి సినిమాలు చేస్తుంది. 2020లో విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమె ఓ కీలక పాత్ర చేసింది. మహేష్ హీరోగా సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా అనంతరం విజయశాంతికి ఆఫర్స్ వచ్చినా, ఒప్పుకోలేదు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ మూవీకి ఓకే చెప్పింది. బహుశా ఈ సినిమాలో ఆమెది పోలీస్ రోల్ కావడం కూడా కారణం కావచ్చు.
వైజయంతి ఐపీఎస్ గా ఆమె సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయనుంది. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్ మైండ్ బ్లాక్ చేసింది. పోలీస్ యూనిఫార్మ్ లో విజయశాంతి లుక్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకుడు. యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా తెరకెక్కించారు. ముఖ్యంగా తల్లీ కొడుకు సెంటిమెంట్ ఈ చిత్రానికి హైలెట్ కానుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భరంగా ప్రమోషన్స్ షురూ చేశారు.
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కి విజయశాంతి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమె కళ్యాణ్ రామ్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కొత్త కథలు, టాలెంటెడ్ దర్శకులను కళ్యాణ్ రామ్ ఎక్కడ పట్టుకొస్తాడో తెలియదు. హిట్ కొట్టాలని చాలా కష్టపడతాడు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ కోసం కళ్యాణ్ చాలా శ్రమించాడు.. అని విజయశాంతి అన్నారు. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జంటగా సాయి మంజ్రేకర్ నటిస్తుంది.
Also Read: ప్రభాస్ చాలా వీక్ గా ఉంటాడు…నాతో పోల్చడం కష్టమే : మంచు విష్ణు…