Tamannaah- Vijay Varma: హీరోయిన్ తమన్నా భాటియా నటుడు విజయ్ వర్మతో రిలేషన్ కన్ఫర్మ్ చేసింది. గత ఆరు నెలలుగా విజయ్ వర్మ-తమన్నా డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ ఉన్నాయి. పలుమార్లు ఈ వార్తలను తమన్నా ఖండించింది. ఎట్టకేలకు ఓపెన్ అయ్యింది. తమన్నా లేటెస్ట్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో పాల్గొన్న మిల్కీ బ్యూటీ అవును విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నానని అన్నారు. కేవలం సహనటుడనే కారణంతో ప్రేమించలేదు. అతడు నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. నన్ను క్రిందకు లాగాలని చూసి వారి నుండి కాపాడతాడనే విశ్వాసంతో దగ్గరయ్యాను.
విజయ్ వర్మ చాలా కేరింగ్ పర్సన్. నన్ను చాలా బాగా చూసుకుంటాడని తమన్నా చెప్పుకొచ్చింది. ఇక విజయ్ వర్మ మాట్లాడుతూ… నా వ్యక్తిగత విషయాలు అప్పుడే ఆడియన్స్ తో చెప్పాలని అనుకోలేదు. అందుకే తమన్నాతో రిలేషన్ గోప్యంగా ఉంచాను. నా ప్రొఫెషనల్ మేటర్స్ మాత్రమే పంచుకోవాలని భావించాను, అన్నారు.
ఇక తమన్నాకు దగ్గరయ్యాక ఆమె ప్రవర్తను బాగానే గమనించాడు. తమన్నా అలవాట్లు అభిరుచులను ఫ్యాన్స్ కి తెలియజేస్తున్నారు. రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా, ఎంత వర్క్ చేసి అలసిపోయినా పొద్దున్నే మాత్రం వ్యాయామం చేయాలి అంటుందట. రాత్రంతా మేలుకొని ఉన్నా ఉదయం వర్క్ అవుట్ స్కిప్ చేయకూడదనేది తమన్నా నియమం అట. విజయ్ వర్మ మాత్రం వ్యాయామం మీద అంత శ్రద్ధ చూపడట. అలాగే చాలా కూల్ గా ఉంటాడట.
లస్ట్ స్టోరీస్ 2 చిత్రీకరణ సమయంలో తమన్నా-విజయ్ వర్మ దగ్గరయ్యారట. ఈ యంతాలజీ సిరీస్లో తమన్నాకు జంటగా విజయ్ వర్మ నటించాడు. వీరి మధ్య బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. జూన్ 29 నుండి లస్ట్ స్టోరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. తమన్నాతో పాటు మృణాల్, కాజోల్ లస్ట్ స్టోరీస్ 2 లో భాగమయ్యారు. లస్ట్ స్టోరీస్ సీజన్ 1 మంచి విజయం సాధించింది. దీంతో సీజన్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి.