ఒక భాషలో స్టార్ హీరోగా సినిమాలో నటించే వాళ్ళు మరో భాషలో విలన్ గా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో విలన్ గా నటిస్తున్న కిచ్చ సుదీప్ కన్నడ చిత్ర సీమలో స్టార్ హీరో. అలాగే బన్నీ నటించిన రేస్ గుర్రం చిత్రం లో విలన్ గా నటించిన రవి కిషన్ భోజపురి చిత్ర సీమలో స్టార్ హీరో. అలా పరభాషా చిత్రాల్లో స్టార్ హీరో అయిన ఒక నటుడు తెలుగు చిత్రం లో విలన్ గా కనిపించబోతున్నాడు.
పిజ్జా సినిమాతో నటుడిగా తమిళ తెరఫై కనిపించిన విజయ్ సేతుపతి ఇపుడో స్టార్ హీరో. తమిళనాట ఇప్పుడు విజయ్ సేతుపతికి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక వైపున తమిళంలో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ కథానాయకుడిగా పేరు సంపాదించుకుంటూనే, మరో వైపున తెలుగులో కీలకంగా నిలిచే విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడు. గత ఏడాది చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా లో ఒక మంచి పాత్ర చేసిన ఈ నటుడు ఇప్పుడు విలన్ గా కొత్త అవతారం ఎత్తుతున్నాడు.త్వరలో విడుదల కాబోతున్న మెగా మేనల్లుడి చిత్రం ‘ఉప్పెన’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషించాడు.
ఆ తరువాత ఆయన బన్నీ కథానాయకుడిగా చేస్తున్న సినిమాలో నెగటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రను చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడుస్తుంది. శేషాచలం అడవి నేపథ్యంలో సాగే ఈ కథలో ముగ్గురు విలన్లలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నట్టుగా వార్తలొచ్చాయి.. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది.అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నటించబోయే వారి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Changing according to situation