https://oktelugu.com/

లాక్ డౌన్ ఉంటే నాకేంటి అన్న పిజ్జా బాయ్

2012 లో వచ్చిన పిజ్జా చిత్రం తో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన తమిళ్ హీరో విజయ్ సేతుపతి.. ఆ తరవాత తెలుగు ప్రేక్షకులకు రజనీ కాంత్ హీరోగా వచ్చిన ‘పేట’ చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనిపించి అలరించాడు. ఇక మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ సైరా నరసింహా రెడ్డి’ లో కూడా.. ఓ ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న […]

Written By:
  • admin
  • , Updated On : April 4, 2020 / 06:01 PM IST
    Follow us on


    2012 లో వచ్చిన పిజ్జా చిత్రం తో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన తమిళ్ హీరో విజయ్ సేతుపతి.. ఆ తరవాత తెలుగు ప్రేక్షకులకు రజనీ కాంత్ హీరోగా వచ్చిన ‘పేట’ చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనిపించి అలరించాడు. ఇక మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ సైరా నరసింహా రెడ్డి’ లో కూడా.. ఓ ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’ చిత్రంలో కూడా హీరోయిన్ తండ్రిగా `రాయనం`పాత్రలో విలనిజం చూపించనున్నాడు. అలాగే అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ చిత్రంలోనూ నటించ బోతున్నాడు అలాగే తమిళంలో హీరో గా విజయాలు అందుకొంటూ మరో పక్క విజయ్ లాంటి స్టార్ హీరోలతో విలన్ గా తలపడుతున్నాడు ..అలాంటి బిజీ హీరో లాక్ డౌన్ బ్రేక్ చేసిన ఘటన చెన్నైలో జరిగింది.

    నిజానికి అది పొగరుతోనో, నిర్లక్ష్యం తోనో చేసిన పని కాదు. దానికి సహేతుక కారణం ఉంది. విజయ్ సేతుపతి స్నేహితుడు, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయిన నెల్లాయ్ భారతి మరణించడం వల్లే అలా లాక్ డౌన్ బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నెల్లాయ్ భారతి .. ఈ శుక్రవారం రాత్రి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడట. ఆ విషయం తెలుసుకున్న విజయ్ సేతుపతి లాక్ డౌన్ ఉన్నప్పటికీ …నెల్లాయ్ భారతి ఇంటికి చేరుకుని.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సంతాపాన్ని తెలపడంతో పాటు అంత్యక్రియలకు అయ్యే ఖర్చులు అన్నీ తానే పెట్టుకుని.. ఆర్ధిక సాయం కూడా చేయడమే గాక భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఎటువంటి కష్టం వచ్చినా.. నేను అండగా ఉంటాను అని భరోసా కూడా ఇచ్చాడట .. ఈ పిజ్జా బాయ్.