Homeఎంటర్టైన్మెంట్Photo Story: ఈ ఫొటోలో ఉన్నది.. ఒకరు పాన్‌ ఇండియా.. మరొకరు సౌత్‌ ఇండియా సార్లు.....

Photo Story: ఈ ఫొటోలో ఉన్నది.. ఒకరు పాన్‌ ఇండియా.. మరొకరు సౌత్‌ ఇండియా సార్లు.. గుర్తుపట్టారా!?

Photo Story: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగంలో ఒక్క ఛాన్స్‌ అంటూ వచ్చేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ నిలదొక్కుకునేది కొందరే. ఎందుకంటే టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. అనేక అంశాలు ఇండస్ట్రీలో నిలబడేందుకు దోహదం చేస్తాయి. ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు.. తమ సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు చిన్న చిన్న గదులలో అద్దెకు ఉంటూ తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్స్‌ అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నవారే. ఇప్పుడు ఆ స్టార్లకు సంబంధించిన అలనాటి జ్ఞాపకాలు నెట్టింట వైరలవుతున్నాయి. అలాంటి వాటిలో ఈ ఫొటో కూడా ఒకటి. ఇందులో ఉన్న ఇద్దరు స్టార్‌ నటులే. ఒకరు పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌. మరొకరు సౌత్‌ ఇండస్ట్రీలో ఫేమస్‌.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
వీరు ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండానే నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇద్దరిలో ఒకరు కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి.. మరోకరు అట్టకత్తి సినిమాతో పాపులారిటీ అందుకున్న దినేశ్‌. ఈ ఫొటో 2009 అక్టోబర్‌ 9న తీసింది. దాదాపు 14 ఏళ్ల క్రితం అట్టకత్తి దినేశ్‌ బర్త్‌ డే సందర్భంగా తీసిన ఫొటో అంటూ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు తమిళ నటుడు రియాజ్‌. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఒకేసారి సిని ప్రయాణం..
వీరిద్దరు కలిసి ఒకేసారి సినీ ప్రయాణం మొదలు పెట్టారు. 2012లో సుందరపాండియన్‌ సినిమాతో విజయ్‌ సేతుపతికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తమిళంలో ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించారు. హీరోగా మంచి క్రేజ్‌ ఉన్న సమయంలోనే తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్‌గా కనిపించారు. ఈ మూవీతో ఆయన క్రేజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో విలన్‌ పాత్ర కోసం విజయ్‌ సేతుపతికి అవకాశాలు క్యూకట్టాయి. ఇటీవలే జవాన్‌ సినిమాతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

దినేశ్‌కూ 2012లోనే బ్రేక్‌..
ఇక మరో నటుడు దినేశ్‌కు కూడా 2012లోనే ఇండస్ట్రీలో బ్రేక్‌ వచ్చింది. ఆ ఏడాది విడుదలైన అట్టకత్తి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తిరుడాన్‌∙పోలీస్, ఇందిర, తిమిళనుకు ప్రెస్‌ నంబర్‌ 1, కబాలి చిత్రాల్లో నటించి తమిళ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular