spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay Jananayagan movie losses: 'జన నాయగన్' నష్టాలను పూడ్చేందుకు విజయ్ సంచలన నిర్ణయం.. ఇలా...

Vijay Jananayagan movie losses: ‘జన నాయగన్’ నష్టాలను పూడ్చేందుకు విజయ్ సంచలన నిర్ణయం.. ఇలా ఇండియాలో ఏ హీరో చెయ్యలేదు..

Vijay Jananayagan movie losses: అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ని నిర్మాతలు దేవుడిలాగా భావించేవారు. ఎందుకంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే, తదుపరి సినిమాని , అదే నిర్మాతతో పైసా రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేసేవాడు. ఒకవేళ నిర్మాతకు సినిమాని నిర్మించడానికి డబ్బులు లేకపోతే, ఫైనాన్స్ కూడా ఇప్పించేవాడు. అలాంటి హీరో మళ్లీ రారేమో అని అంతా అనుకున్నారు. కానీ తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) ఇప్పుడు అదే సూత్రాన్ని పాటిస్తూ సంచలన నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. ఆయన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్ ‘ ఎన్ని చిక్కుల్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. గతం లో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి అటు తెలుగు లో కానీ, ఇటు తమిళం లో కానీ రాలేదు. సెన్సార్ సభ్యులు చెప్పిన మార్పులు చేర్పులు చేసిన తర్వాత కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా రాలేదంటే , ఎంత అన్యాయమే మీరే ఊహించుకోండి.

ఈ కారణం చేత, 400 కోట్ల రూపాయిల బిజినెస్ మొత్తం సర్వనాశనం అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఒక్క బయ్యర్ కూడా ముందుకు రావడం లేదు. ఒప్పందం కుదిరించుకున్న ఓటీటీ సంస్థ కూడా వెనక్కి వెళ్ళింది. ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రం నిర్మాతని పీకల్లోతు నష్టాల్లోకి నెట్టేసింది. ఇవన్నీ సరిపోవు అన్నట్టు, రీసెంట్ గానే ఈ సినిమా సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందు ఇలా జరగడం అన్యాయం , అమానుషం. నిర్మాతకు విజయ్ తీసుకున్న డబ్బులు మొత్తం వెనక్కి తిరిగి ఇస్తే కానీ ఈ నష్టాల నుండి బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. ఇంతటి కష్టమైన పరిస్థితిని అర్థం చేసుకున్న విజయ్ , నిర్మాతకు అండగా నిలబడడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం శభాష్ అనిపించేలా ఉంది.

ఎన్నికలు పూర్తి అయ్యాక, ఇదే KVN బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడట విజయ్. అది కూడా ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత , ఇక సినిమాలు చెయ్యను అంటూ విజయ్ అనేక ఇంటర్వ్యూస్ లో పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ ఇప్పుడు సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడానికి కారణం , కేవలం ఆ నిర్మాతని కాపాడడం కోసమే. ఇదే ఆయన చివరి చిత్రం గా కూడా భావించవచ్చు అట. వాస్తవానికి అయితే ఒక్క సినిమా కూడా చెయ్యకూడదు అని విజయ్ బలమైన నిర్ణయం తీసుకున్నాడు. కానీ KVN ప్రొడక్షన్స్ కోసం ఈ ఒక్క సినిమా చేయడానికి ఆయన రెడీ గా ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహించబోతున్నారు అనేదానిపై స్పష్టమైన క్లారిటీ రావాల్సి ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version