Vijay campaign incident fans fall bike: తమిళనాడులో మరి కొద్దిరోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా రాజకీయ నాయకులూ ఎన్నికల ప్రచారం లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎవ్వరూ తగ్గడం లేదు. DMK , అన్నా DMK పార్టీలకు దీటుగా విజయ్(Thalapathy Vijay) TVK పార్టీ ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే నేడు విజయ్ నిర్వహించిన ఒక ర్యాలీ లో ఆయన్ని అనుసరిస్తూ బైక్ మీద యువకులు వస్తుండగా, ఇద్దరు అదుపు తప్పి పడిపోయారు. ఇది గమనించిన విజయ్ , వెంటనే తన ప్రచార రధాన్ని ఆపేసి, క్రిందకు దిగి వచ్చి ఆ ఇద్దరి యువకుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇలా ఇప్పటి వరకు పొలిటికల్ హిస్టరీ లో ప్రచారం జరుగుతున్న సమయం లో ఎవరైనా కింద పడిపోయినప్పుడు మధ్యలో దిగి వచ్చి వాళ్ళ బాగోగులు అడిగిన నాయకుడు ఎవ్వరూ లేరు.
విజయ్ ఇంత శ్రద్ద, ప్రేమ చూపించడానికి ప్రధాన కారణం కరూర్ ఘటన. ఈ సభలో తొక్కిసలాట ఘటన జరిగి దాదాపుగా 41 మంది ప్రాణాలను కోల్పోయారు . ఈ ఘటన విజయ్ ని తీవ్రమైన మానసిక దిగ్బ్రాంతికి గురయ్యేలా చేసింది. కొన్ని రోజులు ఆయనకు ఎలా స్పందించాలో అర్థం అవ్వక , మీడియా కి దూరం గా ఉన్నాడు. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత స్పందించాడు. ఆయన ఈ ఘటన పట్ల స్పందించిన తీరు, మృతుల కుటుంబాలతో మాట్లాడిన తీరుజేపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. విజయ్ పొలిటికల్ జర్నీ ఇక ముగిసినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ధైర్యం తెచ్చుకొని మళ్లీ తన పొలిటికల్ జర్నీ ని కొనసాగిస్తున్నాడు విజయ్. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృత్తం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు విజయ్.
Also Read: ‘పెద్ది’ స్థానంలో ‘జన నాయగన్’..ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదు సామీ..
అందుకే ఈ చిన్న ఘటన కు కూడా ఆయన ఆ రేంజ్ రియాక్షన్ ఇచ్చాడు. అయితే బైక్ నుండి క్రింద పడిపోయిన ఆ ఇద్దరి అభిమానులకు ఎలాంటి తీవ్రమైన గాయాలు అవ్వలేదట. వాళ్ళు సురక్షిస్తాంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇక విజయ్ TVK పార్టీ విషయానికి వస్తే , తమిళనాడు లోని అన్ని పార్టీలు కూటమిగా పోటీ చేస్తుంటే విజయ్ ఒక్కడే ఒంటరిగా పోటీ చేయబోతున్నాడు. ఎన్డీయే నుండి ఆయనకు పిలుపు కూడా వచ్చింది. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఇస్తామని కూడా చెప్పారట. కానీ విజయ్ ఒప్పుకోలేదు. తానూ నమ్ముకున్న సిద్ధాంతాల ప్రకారంగానే ఎన్నికల సమరం లో పోటీ చేస్తానని , ఏ పార్టీ తో కూడా జత కట్టబోవడం లేదని చెప్పుకొచ్చాడు. ఇక ప్రముఖ సర్వేల ఆధారంగా చూసుకుంటే , విజయ్ కి 8 నుండి 12 శాతం ఓటు షేర్ నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
A Couple fell down from the bike !!#ThalapathyVijay noticed that and he came out of he vehicle and checked them if they are fine♥️ pic.twitter.com/v3h3eCZUcp
— AmuthaBharathi (@CinemaWithAB) April 2, 2026
