Sankranti 2026 Movies: సినిమా అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉంటుంది. కారణం ఏంటి అంటే స్క్రీన్ మీద కనిపించే వారిని బయట జనాలు దేవుళ్ళ లా చూస్తుంటారు. ఇక వాళ్ళను డైరెక్ట్ గా చూసిన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చిన అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. వాళ్ళు కనిపించిన ప్రతిసారి వాళ్ళతో సెల్ఫీ దిగడానికి పోటీ పడుతూ ఉంటారు. అందుకోసమే సినిమాల్లో నటించడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. తద్వారా వాళ్ళకంటూ ఒక స్టార్ డమ్ ను సంపాదించుకొని వాళ్ళు కూడా సెలబ్రిటీలుగా మారిపోతే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం అవ్వదు. ఇక్కడ సక్సెస్ సాధించాలి అంటే అహర్నిశలు ప్రయత్నం చేయాలి. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన విజయ్ ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. ఇక ప్రస్తుతం ఆయన ఒక పొలిటికల్ పార్టీని సైతం స్థాపించి ఫుల్ టైం పాలిటిక్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక ఆయన చివరి సినిమాగా ‘జన నాయగన్’ అనే సినిమాని చేస్తున్నాడు ఈ మూవీని 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో సైతం ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగ వంశీ రిలీజ్ చేస్తున్నారు… నిజానికి ఈ సినిమా గత రెండు సంవత్సరాల క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమా కి రీమేక్ గా తెరకెక్కుతోంది.
ఆల్రెడీ తెలుగులో సూపర్ సక్సెస్ ను సాధించిన ఈ సినిమాని మళ్లీ తెలుగులో డబ్ చేసి ఎందుకు రిలీజ్ చేయడం అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఎందుకు మన సినిమాలకు పోటీగా సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…
ఇక ఆల్రెడీ సంక్రాంతికి నాగ వంశీ బ్యానర్ నుంచి ‘అనగనగా ఒక రాజు’ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. మరి ఈ సినిమా ఉండగా మళ్లీ ఇంకో సినిమాను తీసుకురావడం ఎందుకు అంటూ మరి కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు… ఇప్పటికే రాజసాబ్, చిరంజీవి మన శంకర వర ప్రసాద్ లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
వాటన్నింటికి పోటీగా ఈ సినిమాను తీసుకొచ్చి థియేటర్లను కోసం పోటీ పెట్టడం ఎందుకు అంటు ప్రభాస్, చిరంజీవి అభిమానులు సైతం వాపోతున్నారు… చూడాలి మరి ఈ సినిమా మన తెలుగు సినిమాలతో పాటు పోటీ పడి నిలబడగలుగుతుందా? లేదా అనేది…