Prabhas Sreenu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కమెడియన్స్ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో వాళ్ళకంటూ ఒక గొప్ప క్రేజ్ ను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుండడం విశేషం… ఇక ఎవ్వరు ఎలాంటి స్ట్రాటజీ మైంటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ప్రభాస్ శీను ఒక నాకు టైం లో చాలా మంచి కమెడియన్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అతనికి చాలా సినిమాల్లో అవకాశాలైతే వచ్చాయి. నిజానికి ప్రభాస్ శ్రీను కెరియర్ స్టార్టింగ్ లో ప్రభాస్ కి డేట్స్ చూసేవాడు. అందువల్లే అతనికి ప్రభాస్ శ్రీను అనే పేరే వచ్చింది. ప్రభాస్ సినిమాలు రికమెండ్ చేయడంలో అసలు ఎంకరేజ్ చేయడని ఇతర విషయాల్లో మనకు ఏది కావాలంటే అది వరాల జల్లు కురిపిస్తాడు కానీ, సినిమా కోసం రికమెండ్ చేయమంటే మాత్రం అస్సలు చేయడానికి ఇష్టపడడు.
Also Read: ‘అఖండ 2’ మూవీ ఫస్ట్ రివ్యూ…బొమ్మ ఎలా ఉందంటే..?
నీ కష్టం నువ్వు పడాల్సిందే అలా పడినప్పుడే నీకంటూ మంచి అవకాశాలు వస్తాయి. నువ్వు టాప్ పొజిషన్ కి వెళ్తావు అంటూ చెబుతూ ఉంటాడట. అందువల్లే ప్రభాస్ శ్రీను కూడా అదే చెప్పడంతో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ రాజమౌళి విక్రమార్కుడు సినిమాలో వచ్చిన అవకాశాన్ని వాడుకున్నాడు.
ఇక అప్పటి నుంచి రాజమౌళి ప్రతి సినిమాలో కూడా ప్రభాస్ శ్రీను ని తీసుకుంటున్నాడని తన యాక్టింగ్ అంటే రాజమౌళికి చాలా ఇష్టమైన అని చెబుతుండటం విశేషం… ఇక మొత్తానికైతే ఈ మధ్యకాలంలో ప్రభాస్ శ్రీను పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. కారణమేదైనా కూడా ఆయనకు తగ్గట్టు పాత్రలు రావడంలేదని ఎంతసేపు అవే రొటీన్ క్యారెక్టర్స్ వస్తున్నందు వల్ల ఆయన సినిమాలు చేయడం లేదంటూ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఇప్పటికైనా ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఆయన చేసిన సినిమాల్లో యమదొంగ,గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి…