Hero Vijay: హీరో విజయ్ కి ఫైన్… ఆయన చేసిన నేరం ఇదే!

ఫ్యాన్స్ నుండి తప్పించుకునే క్రమంలో విజయ్ కారు రెండు చోట్ల సిగ్నల్ క్రాస్ చేసింది. కారు నెంబర్ ఆధారంగా అది విజయ్ కి చెందినదని సమాచారం సేకరించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు రూ. 500 జరిమానా విధించారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ బెయిల్ దిగుతుందట.

Written By: Shiva, Updated On : July 12, 2023 11:36 am

Hero Vijay

Follow us on

Hero Vijay: హీరో విజయ్ అపరాధ రుసుము చెల్లించాల్సి వచ్చింది. విజయ్ మంగళవారం చెన్నై నగరంలో రెండు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులు ఆయనకు ఫైన్ విధించారు. విజయ్ ఇటీవల లియో షూటింగ్ పూర్తి చేశాడు. లియో మూవీ అక్టోబర్ 19న విడుదల కానుంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి. ప్రోమోలు ఆకట్టుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లియో మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు.

లియో అనంతరం దర్శకుడు వెంకట్ ప్రభుతో విజయ్ మూవీ ప్రకటించారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. విరామ సమయంలో విజయ్ పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీ అవుతున్నారు. ఆయన తరచుగా విజయ్ మక్కల్ ఇయక్కమ్ సభ్యులతో భేటీ అవుతున్నారు. మంగళవారం చెన్నైలోని పనయూర్ ఆఫీస్ లో ఆయన విజయ్ మక్కల్ ఇయక్కమ్ సభ్యులను కలిశారు. మీటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతుండగా అభిమానులు పెద్ద మొత్తంలో కారును వెంబడించారు.

ఫ్యాన్స్ నుండి తప్పించుకునే క్రమంలో విజయ్ కారు రెండు చోట్ల సిగ్నల్ క్రాస్ చేసింది. కారు నెంబర్ ఆధారంగా అది విజయ్ కి చెందినదని సమాచారం సేకరించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు రూ. 500 జరిమానా విధించారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ బెయిల్ దిగుతుందట.

ఇప్పటికే ఆ పార్టీ నాయకులతో విజయ్ భేటీ అవుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం మాత్రమే ఉంది. అందుకే సమాయత్తం అవుతున్నారు. వెంకట్ ప్రభుతో చేసేదే విజయ్ చివరి చిత్రం అంటున్నారు. సినిమాలకు విరామం ప్రకటించనున్న విజయ్ పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించనున్నారట. సీఎం పీఠమే లక్ష్యంగా విజయ్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారట. ఈ క్రమంలో ఆయన పాదయాత్ర కూడా చేసే అవకాశం కలదట. జాతీయమీడియాలో విజయ్ పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.