Vijay : తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్(Ilayathalapathy Vijay) ఇటీవలే ‘తమిళగ వెట్రి కజగం'(Tamilaga Vetri Kazhagam) అనే రాజకీయ పార్టీ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ ని ఏర్పాటు చేసి ఏడాది అయిన సందర్భంగా ఇటీవలే వార్షికోత్సవ దినోత్సవాన్ని కూడా జరిపించాడు విజయ్. అంతే కాకుండా పలు రాజకీయ కార్యక్రమాలు, అదే విధంగా ప్రభుత్వం పై పలు నిర్ణయాలపై నిరసనలు వ్యక్తం చేస్తూ పార్టీ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. వచ్చే ఏడాది తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీ పోటీ చేయనుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ పై జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకత, అదే విధంగా ఆయనకు వయస్సు అయిపోతుంది అనే వాదన, మరో పక్క ‘అన్నా DMK’ పార్టీ కి క్యాడర్ ఉన్నప్పటికీ న్యాయకత్వం లోపించడం. ఇలా తమిళనాడు చాలా పెద్ద పొలిటికల్ స్పేస్ ఏర్పడింది.
Also Read : తమిళ హీరో విజయ్ ఇంటి పై చెప్పులతో దాడి చేసింది అభిమానియేనా..? కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఈ స్పేస్ ని విజయ్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికలలో ఆయన గెలుస్తాడా లేదో తెలియదు కానీ, తమిళనాడు కి భవిష్యత్తు ముఖ్యమంత్రి మాత్రం విజయ్ మాత్రమే అని అక్కడ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. ఇదంతా పక్కన పెడితే నేడు మహిళా దినోత్సవం అనే సంగతి మన అందరికీ తెలిసిందే. సినీ నటులు, రాజకీయ నాయకులూ ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్స్ వేస్తున్నారు. విజయ్ కూడా అలా సింపుల్ గా ట్వీట్ వేసుంటే సరిపోయేది. కానీ ఆయన ‘మహిళలకు ఇప్పటి ప్రభుత్వం అసలు ఏమి చేయలేదు. వాళ్ళ అభివృద్ధికి ఎలాంటి తోడ్పాటు అందించలేదు. కాబట్టి మహిళలందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో తరిమి కొట్టండి’ అంటూ ఆయన ఒక వీడియో విడుడుదల చేసాడు. ఈ వీడియో ఇప్పుడు పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది.
మహిళలకు శుభాకాంక్షలు తెలియచేయాలని నీకు లేదు, కేవలం వాళ్ళు DMK పార్టీ కి ఓట్లు వేయకూడదు అని మాత్రమే చెప్తున్నావా అంటూ సొంత అభిమానులు సైతం సోషల్ మీడియా లో విజయ్ ని తిడుతున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా విజయ్ ముస్లిమ్స్ కి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసాడు. ఈ విందులో విజయ్ ముస్లిం లాగా కనిపించడం పై అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా విజయ్ ని ఇలాంటి లుక్ లో చూస్తామని అనుకోలేదు, ఎన్నో ఏళ్ళ నుండి తమిళనాడు లో ఉన్నావు, ఏనాడైనా ముస్లిమ్స్ కి ఇలా ఇంటికి పిలిచి భోజనం పెట్టావా?, అకస్మాత్తుగా ఇప్పుడు వాళ్లేందుకే నీకు గుర్తొచ్చారు, ఇదంతా చూసేవాళ్లకు కేవలం ఎన్నికల స్టంట్స్ మాత్రమే అని, ఇలాంటివి జనాలు నమ్మే రోజులు పొయ్యాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : విజయ్ ఇంటిపైకి చెప్పు విసిరిన యువకుడు.. భగ్గుమన్న తమిళనాడు.. అసలేమైందంటే?